Tuesday, April 22, 2025

వైయస్సార్ కాంగ్రెస్ మహిళా నేత యాక్టివ్.. పూర్వ వైభవం సాధ్యమేనా?

- Advertisement -

మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత యాక్టివ్ అయ్యారా? దూకుడు పెంచుతున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకువెళ్లనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె నేరుగా తాడేపల్లి కి వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో గోపాలపురం నియోజకవర్గ బాధ్యతలను తిరిగి ఆమెకు కట్టబెట్టారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

తానేటి వనితకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. తండ్రి వారసత్వంగా 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు తానేటి వనిత. ఆ ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు తానేటి వనిత. టిడిపి తో పాటు ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకున్నారు. 2014 ఎన్నికల్లో గోపాలపురం నుంచి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. అయితే పార్టీ అవసరాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ఆమెను కొవ్వూరు నియోజకవర్గానికి పంపించారు. అయినా సరే భారీ మెజారిటీతో ఆమె గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన పదవిని కట్టబెట్టారు. చివరి రెండు సంవత్సరాలు హోం మంత్రి పదవి ఇచ్చారు. జగన్ మంత్రివర్గంలో ఐదేళ్లపాటు కొనసాగిన ఐదుగురు మంత్రులు ఈమె కూడా ఒకరు కావడం విశేషం.

అయితే ఈ ఎన్నికల్లో గోపాలపురం నుంచి పోటీ చేసిన ఆమెకు ఓటమి ఎదురైంది. అప్పటినుంచి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. ఆమె చుట్టూ రకరకాల ప్రచారం నడిచింది. పూర్వాశ్రమం టిడిపిలోకి వెళ్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే తాజాగా ఆమె జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. గోపాలపురం బాధ్యతలు తీసుకోవాలని అధినేత సూచించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీలో సభ్యురాలిగా ఆమెను నియమించారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేసేందుకు ఆమె సిద్ధపడుతున్నారు. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ మహిళ నేత యాక్టివ్ కావడం గమనార్హం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!