Wednesday, April 24, 2024

రోశయ్య పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసిన జగన్

- Advertisement -

మాజీ సీఎం రోశయ్యకు ఏపీ సీఎం జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన పేరు చరిత్రలో మిగిలిపోయేలా చేశారాయన. అందరు అనుకుంటున్నట్లు రోశయ్యపై తనకు ఎలాంటి కోపం లేదని చెప్పకనే చెప్పారాయన. తాజాగా రోశయ్య విగ్రహానికి ప్రభుత్వ తరుఫున ఆర్థిక నిధులు విడుదల చేసి.. తన ఉదారతను జగన్ మరోసారి చాటుకున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

వైఎస్ఆర్ మరణం తరువాత అందరు కూడా ఆయన తనయుడైన వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. నాయకులు కార్యకర్తలు అందరు కూడా జగన్ సీఎం కావాలని ఆశించారు. కాని జగన్‌కు వ్యతిరేకంగా వైఎస్ఆర్‌కు అత్యంత ఆప్తుడైనా అప్పటి ఆర్థిక మంత్రి అయిన రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై జగన్ ఎప్పుడు కూడా నోరు మెదిపింది లేదు. కాకపోతే జగన్‌కు సీఎం కావాలనే కోరిక ఉంది… కాని దానిని ఎప్పుడు కూడా ఆయన బయటపెట్టింది లేదు.

రోశయ్య ప్రభుత్వనికి అనుగుణంగా నడుచుకున్నారు జగన్. కాని తన తండ్రి వైఎస్ఆర్ చనిపోయారనే బాధలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రగాఢంగా నమ్మారు జగన్. దీనిలో భాగంగానే ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని సోనియా చూట్టు అనేకమార్లు తిరిగారు జగన్. ఇటువంటి సమయంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య హఠాత్తుగా రాజీనామా చేయడం సంచలనం స‌ృష్టించింది.

జగన్ ఒత్తిడి వల్లే రోశయ్య ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారని కామెంట్స్ అప్పట్లో బాగా వినిపించాయి. అటు జగన్ కాని ఇటు రోశయ్య కాని.. దీనిపై ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. కాని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతు..తనను ఎప్పటి కూడా జగన్ ఇబ్బంది పెట్టింది లేదని రోశయ్య స్పష్టం చేశారు. తన తండ్రి చనిపోయిన తరువాత జగన్ రెండు, మూడుసార్లు మాత్రమే తనని కలిశారని.. అది కూడా ఓదార్పు యాత్రకు అనుమతి గురించే కలిశారు తప్ప… మరో విషయంలో కాదని ఆయన తెలిపారు. కాని రోశయ్య మరణించినప్పుడు మాత్రం జగన్ వెళ్లకపోవడాన్ని చాలామంది తప్పుపట్టారు. అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసినట్లు అయింది.

దివంగత కొణిజేటి రోశయ్య జ్ఞాపకంగా బాపట్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రోశయ్య సొంతూరైన బాపట్లలోని వేమూరు గ్రామంలో ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటు చేయనున్నారు. బాపట్లలోని వేమూరులో రోశయ్య విగ్రహ ఏర్పాటు చేస్తున్నరనే విషయం తెలుసుకున్న జగన్ ప్రభుత్వం కాంశ్య లేదా ఇత్తడి విగ్రహ ఏర్పాటు కోసం రూ.10 లక్షలు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు. రోశయ్య విగ్రహ ఏర్పాటుపై జగన్ తీసుకున్న చొరవపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!