Pavankalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై రోజురోజుకి కౌంటర్లపై కౌంటర్లు పడుతున్నాయి. రీ కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. వదర బాధితులను పరామర్శించ లేదంటూ విపక్షాలు దుమ్ముత్తి పోస్తున్నాయి. తనపై వస్తున్న విమర్శలపై మండి పడుతున్నారు పవన్. ఆర్థిక ఇబ్బందులు, పలు ఛాలెంజ్ లు ఉన్న పరిస్థితుల్లో వరదలు వచ్చాయి. నేను బాధితులను పరామర్శించడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను అని పవన్ చెప్పి తప్పించుకుంటున్నారు.
వరదలకు కారణం వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. మీ పాలనలో ఎలాంటి చర్యలు తీసుకోవకపోవడం వల్లే ఈ పరిస్థితి అంటూ ప్రతిపక్షంపై నెట్టేస్తున్నారు. ఈ విషయంపై మళ్లీ నెటిజన్ల కౌంటర్లు దుమారం రేపు తున్నాయి. అసలు పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటున్నారు. గత ప్రభుత్వ లోపాలపై ప్రస్తావించే సయమం కాదు… పరిష్కారం ఇచ్చే సమయంఇది. కూటమి నేతల లోపాలు బయట పడతాయనే భయంలోనే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని రాజకీయ విజ్ఞులు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ప్రజల కోసం ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా పోయింది. మేనిఫెస్టో అంటున్నారు. అడిగితే కేబినెట్ లో చర్చిస్తామంటున్నారు తప్ప చేతలు కనపడటం లేదని మండి పడుతున్నారు. ప్రతిరోజు జగన్, నేతలు టూరు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ లోపాలను కడిగిపారేస్తున్నారు. వాటికి ధీటైన సమాధానం కూటమి ప్రభుత్వం దగ్గర లేదు, ఎందుకంటే పరిస్థితిపై సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతోందని నెటిజన్స్ ఆడిపోసుకుంటున్నారు.
మొక్కుబడిగా సమీక్షలు, మాట్లాడితే గత ప్రభుత్వ పాలన ప్రస్తావనే తప్ప ఇంకేమీ కనిపించడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు పవన్ ఏం చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. ఆక్రమణలు అంటున్నారు. వరదలకు కారణమంటున్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత ప్రభుత్వం పక్కన పెట్టండి. రాజకీయాల్లో విమర్శలు సహజం.. అది వరదల సమయంలో వచ్చిన విమర్శలు మాత్రం సమన్వయ లోపంతోనే వచ్చినవే. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వమే ప్రతిపక్షంలా, అధికార పక్షంలా విమర్శలు, సమర్ధనలు చేసుకుంటోంది. వరదల్లో 30 మంది మృతికి కారణం మీ ప్రభుత్వం కాదా అంటూ నిలదీస్తున్నారు. గతంలో పవన్ చేసినవి విమర్శలే.. ఇప్పడు చేసినవీ విమర్శలే తప్ప… ప్రజలకు చేసిందేమీ లేదని అసహన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి..
————— పట్ట. హరీష్ —————————–