Wednesday, October 16, 2024

ఎన్టీఆర్‌నే ఎదురించిన దమ్మున్న ఏకైక హీరో.. ఆ గట్స్‌కు ఎవడైనా ఫిధా అవాల్సిందే

- Advertisement -

ఎన్టీఆర్‌ను తొక్కి పెట్టిన కృష్ణ.. ఆ గట్స్‌కు ఎవడైనా ఫిధా అవాల్సిందే

ఎన్టీఆర్‌ను ఎదురించిన ఏకైక మొనగాడు కృష్ణనే

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇద్దరు హీరోల చేతులలో నలిగిపోతున్న రోజులు అవి. ఆ హీరోలు మరెవ్వరో కాదు ఒకరు ఎన్టీఆర్ కాగ, మరోకరు ఏఎన్ఆర్. ఎన్టీఆర్ మాస్ సినిమాలు చేసుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతుంటే… ఏఎన్ఆర్ ఫ్యామిలీ సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నారు. అయినప్పటికి కూడా వీరిద్దరు మధ్య విభేదాలు ఉండేవి. ఇద్దరి మధ్య మాటలు కూడా ఉండేవి కావని తెలుస్తోంది. ఆ సమయంలోనే ఓ యువకుడు హీరోగా ఇండస్ట్రీలో దూసుకువచ్చారు. ఆ హీరో మరెవరో కాదు… కృష్ణ. అభిమానులు ముద్దుగా ఆయన్ను సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎన్టీఆర్ అభిమానిగా ఇండస్ట్రీకి వచ్చానని.. ఆయన సినిమాలు చేసే పెరిగానని చెప్పుకునే కృష్ణ…ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీయడం సంచలనంగా మారింది.

ఎన్టీఆర్‌కు పోటీగా సినిమాలు తీయడం కృష్ణకు అలవాటుగా మారింది. ఎన్టీఆర్ ధాన వీర శుర కర్ణ సినిమాను తీస్తుంటే…దానికి పోటీగా కురుక్షేత్రం సినిమాను తెరకెక్కించి సంచలనం సృష్టించారు. అప్పట్లో దేవదాసు సినిమా సూపర్ హిట్ .. అయినప్పటికి కూడా కృష్ణ కూడా దేవదాసు మళ్లీ పుట్టాడు సినిమాను తీసి.. ఏఎన్ఆర్‌కు పోటీ ఇచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో…తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా.. ఆ పార్టీకి మద్దతుగా నిలిస్తే…కృష్ణ మాత్రం..అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్టీఆర్‌కు షాకిచ్చారు. ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత వంగవీటి రంగ హత్యలో టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో..దానిపై కూడా ఓ సినిమాను తెరకెక్కించి.. ఎన్టీఆర్ మీద విమర్శలు చేసిన గట్స్ ఖచ్చితంగా కృష్ణకే దక్కుతుంది.

ఇక అల్లూరు సీతరామరాజు విషయంలో కృష్ణ ధైర్య సాహసాలు ఎంత చెప్పుకున్న తక్కువే. ఎన్టీఆర్ అల్లూరు సీతరామరాజు తీద్దామనే లోపే… కృష్ణ తన టీంతో అల్లూరు సీతరామరాజు సినిమాను తెరకెక్కించారు. ఆ సమయంలో వీరిద్దరు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అల్లూరు సీతరామరాజు సినిమాను ఆపేయాలని కృష్ణను కోరినప్పటికి కూడా …ఆయన మొండిగానే ముందుకు సాగారు. ఏది ఏమైనప్పటికి కూడా అటు సినిమా రంగంలో కానివండి… ఇటు రాజకీయ రంగంలో కానివండి.. ఎటు చూసిన ఎన్టీఆర్‌ను ఎదురించిన ఏకైక మొనగాడు కృష్ణనే. అలాంటి గట్స్ ఉన్న మనిషి మరోకరు ఉండరు. ఏది ఏమైనప్పటికి కూడా కృష్ణ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటే అని చెప్పాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!