Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇక రెండో వారం ప్రారంభం నుంచి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లకు అభిమానుల మైండ్ బ్లాక్ అవుతుంది. రెండు రోజులుగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు కొత్తగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం యష్మీ గౌడ మాత్రమే ఇంట్లో సేఫ్ జోన్‌లో ఉంది. మిగతా వారంతా నామినేషన్‌లో ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో గొడవలేమీ లేవు కానీ ఒక్కొక్కరికి వాచి పోయింది.. అలాగే హౌసులో మరో జంట మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్‌లోని విశేషాలను ఓ సారి చూసేద్దాం.
బిగ్ బాస్ హౌస్ అంతా దాదాపు యష్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. సంచాలాక్ గా తాను చెప్పిన మాటే వేదంగా మారింది. బిగ్ బాస్ ఆమెకు పూర్తి అధికారాలను ఇచ్చారు. ఇరు జట్లు ఒంటరి పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా నిఖిల్ టీమ్‌లో స్థానం దక్కించుకున్నందుకు నాగ మణికంఠకు దారుణంగా అన్యాయం జరుగుతుందని ప్రేక్షకులు తెగ ఫీల్ అవుతున్నారు. తన టీమ్‌లో నిఖిల్, మణికంఠ మాత్రమే ఉన్నప్పటికీ ప్రతి టాస్క్‌లోనూ తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో నైనికా టీం నుంచి నబీల్ కూడా ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. లేకుంటే ఆకలితో చావాల్సిందే అన్నట్లు ఉన్నాయి బిగ్ బాస్ టాస్కులు.
నిఖిల్ టీమ్‌లో నాగ మణికంఠ ఒక్కడే ఉన్నాడు. ఇద్దరు ఆడి గెలిస్తే తప్ప తిండి దొరకదు. ఎలాగోలా గెలిచి రాగి జావాను గెలుచుకున్నారు. ఇతర జట్లు కడుపునిండా భోజనం చేయడం, జ్యూస్‌లు తాగడం చూసి మణికంఠ ఫీలయ్యాడు. అంతే కాకుండా మణికంఠ, నిఖిల్ ఇద్దరే టాస్క్ లు ఆడాల్సి రావడంతో బాగా అలసిపోయారు. దీంతో మణికంఠ భోజనం కోసం బిగ్ బాస్ ఆదేశాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అతను అస్సలు ఆకలికి తట్టుకోలేడు. అందుకే మరే గత్యంతరం లేక ఫుడ్ దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడు.
రాత్రి అందరూ పడుకున్న తర్వాత మణికంఠ వెళ్లి దోశలు వేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడ కొంతమంది హౌస్‌మేట్స్ ఉన్నప్పటికీ, తనను చూసి జాలిపడి ఎవరూ ఏమీ అనలేదు. మౌనంగా చీకట్లోకి వెళ్లి దోశలు తింటూ ఉండగా నిఖిల్ అక్కడికి వచ్చాడు. అలా ఇద్దరు కలిసి దోశలు తిని కడుపు నింపుకున్నారు. రూ.50 వేలు ప్రైజ్ మనీ రావాలంటే పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ కాళ్లు, ఛాతీపై వ్యాక్స్ చేయించుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. వెంట్రుకలు పీకుతున్నప్పుడు నొప్పి భరించలేక పృథ్వీ అక్కడి నుంచి తప్పుకున్నాడు. నబీల్ నొప్పి ఉన్నప్పటికీ టాస్క్ గెలిచాడు. వ్యాక్స్ వల్ల అతని ఛాతీ ఎర్రగా అయిపోయింది. అతను టాస్క్‌లో పడ్డ కష్టం చూసి సీత ఇంప్రెస్ అయి ముద్దుపెట్టుకుంది. ఇది ఎపిసోడ్ కే హైలెట్గా మారింది.. ఓవరాల్ గా ఫుడ్ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్లను బాగానే లాక్ చేశారు. ఫుడ్ కోసం హౌస్ మేట్స్ పోరాడుతున్నారు. రానురాను బిగ్ బాస్ ఎలాంటి టాస్క్‌లు ఇస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.