Saturday, April 20, 2024

జగన్ కడప టూర్‌లో విచిత్ర సంఘటన.. నా సొంత తమ్ముడే అని చెప్పిన జగన్

- Advertisement -

జగన్ కడప టూర్‌లో విచిత్ర సంఘటన.. నా సొంత తమ్ముడే అని చెప్పిన వినని వైనం

ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మూడు రోజుల పాటు తన సొంత జిల్లాలో పర్యటించారు. చాలాకాలం తరువాత జగన్ కడప జిల్లాకు రావడంతో అభిమానులు భారీ ఎత్తున అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. తన దగ్గరకు వచ్చిన అభిమానులను అప్యాయంగా పలకరించిన జగన్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే తీర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారాయన. ఇడులపాయకు చేరుకున్న జగన్ అక్కడున్న వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. తరువాత జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కడపలోనే ఉన్న జగన్.. అక్కడ స్థానికులతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కడపలో మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు తాడేపల్లికి చేరుకునే క్రమంలో ఓ విచిత్ర సంఘన చోటు చేసుకుంది. జగన్ తాడేపల్లికి చేరుకోవడానికి తన హెలికాఫ్టర్ దగ్గరకు రాగా.. అది సమయంలో ఓ అర్థీదారుడు.. జగన్‌కు వినతిపత్రం ఇవడానికి అక్కడకు చేరుకున్నాడు. అయితే ఇది గమనించిన జగన్… హెలికాఫ్టర్ దగ్గరకు అర్థీదారుడును పిలిచి.. మాట్లాడారు. అతని చేతిలో ఉన్న అర్జీ పత్రాన్ని పక్కన ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాలని సూచించగా..ఆ అర్థిదారుడు మాత్రం జగన్‌కే ఇస్తానని పట్టుపడ్డాడు. దీంతో జగన్ మాట్లాడుతూ ఆయన ఎవరో కాదు .. అవినాష్ రెడ్డి నా సొంత తమ్ముడే కదా అని ఆ అర్జీదారుడుకు వివరించారు.దీంతో అర్జీదారుడు అవినాష్ రెడ్డికి తన అర్జీని ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని అవినాష్ రెడ్డికి జగన్ సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!