Saturday, May 18, 2024

టీడీపీ శ‌వాల వేట‌.. శ‌వాల‌తో రాజ‌కీయం

- Advertisement -

రాష్ట్రంలో టీడీపీకి ఇప్పుడు శ‌వ రాజ‌కీయాల సీజ‌న్ వ‌చ్చింది. వైసీపీని ఎదుర్కోలేక‌, జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాలకు ఎదురు నిలువలేక టీడీపీ షార్ట్ క‌ట్ మార్గం ఎంచుకుంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాలు నిర్మించి దానిని ఓటు బ్యాంకుగా మ‌లిచి తిరిగి అధికారంలోకి వ‌చ్చాక నెర‌వేర్చాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్‌. నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాలి. ప్ర‌జా ఉద్య‌మాలు నిర్మించాలి. ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగించాలి. అధికారంలోకి వ‌స్తే ఇచ్చిన హామీలు నెర‌వేరుస్తామ‌నే భ‌రోసా ప్ర‌జ‌ల‌కు క‌ల‌గాలి. అందుకే చంద్ర‌బాబు షార్ట్ క‌ట్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎక్క‌డ శ‌వం దొరికితే అక్క‌డ వాలిపోవ‌డం. శ‌వాల‌కు కులాల‌ను అంట‌గ‌ట్ట‌డం. వైసీపీ నాయ‌కుల ప్ర‌మేయం ఉంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేయించి ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్ల‌డం. దీనికైతే ఖ‌ర్చు అవ‌స‌రం లేదు. శవం ఉంటే చాలు.

ఎల్లో మీడియా మొద‌లుపెడుతుంది..

ఎవ‌రైనా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనో కుటుంబ స‌మ‌స్య‌ల‌తోనో ఆత్మ‌హ‌త్య చేసుకుంటే లేదా హ‌త్య గావించ‌బ‌డితే ఎల్లో మీడియా దానిని వ‌క్రీక‌రించి అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణంగా చిత్రీక‌రిస్తుంది. దానిని ప‌ట్టుకుని టీడీపీ నాయ‌కులు ఘ‌ట‌నా స్థ‌లంలో వాలిపోతారు. ఎల్లో మీడియా ఛానెల్ల‌ను పోగేసి పెయిడ్ వార్త‌లు అల్లేస్తారు. బాధితులు మాట్లాడ‌కుంటా ఉండ‌టానికి డ‌బ్బు ఇస్తామ‌ని ఆశ చూపిస్తారు. అప్పటికే ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఉన్న కుటుంబాలు కావ‌డంతో దాన్ని కాద‌న‌లేరు. రెండు మూడు రోజులు తంతు ముగిసేదాకా మాట్లాడ‌కూడ‌ద‌ని కండిష‌న్ పెడ‌తారు.. ఒక్కోసారి త‌మ అక్క‌ర గడుపుకుంటారు కానీ, బాధితుల‌కు ఇస్తామ‌న్న డ‌బ్బులు కూడా ఇవ్వ‌రు..

శ‌వ రాజ‌కీయాల సీజన్‌

ఏ స‌మ‌స్యా లేన‌ప్పుడు టీడీపీకి శ‌వాలే దిక్కు. తాజాగా కోన‌సీమ జిల్లాలో శ్యామ్ అనే 20 ఏళ్ల యువ‌కుడు ప్రేమ వ్య‌వ‌హారం, చ‌దువుల్లో వెనుకబాటుత‌నంతో కుంగిపోయి మాన‌సిక వేద‌న‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పేప‌ర్లో వ‌చ్చిందే ఆల‌స్యం టీడీపీ వాలిపోయింది. వైసీపీ నాయ‌కుల వేధింపులే కార‌ణ‌మ‌ని పెయిడ్ మీడియాలో ఊద‌ర‌గొట్టింది. కానీ వాస్త‌వం చూస్తే వైసీపీకి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధమే లేదు.. కానీ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌ని ఆ షార్ట్ క‌ట్ ని చంద్ర‌బాబు ఎంచుకున్నాడు.

వారం ప‌ది రోజుల కింద‌టే బాప‌ట్ల జిల్లా రేప‌ల్లెలోనూ అంతే.. అమ‌ర్నాథ్ అనే ప‌దో త‌ర‌గతి బాలుడ్ని వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి పెట్రోల్ పోసి నిప్పంటించి త‌గ‌ల‌బెట్టాడు. పోలీసులు వెంట‌నే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని జైలుకు కూడా త‌ర‌లించారు. నిందితుడు రెడ్డి కావ‌డంతో టీడీపీ నాయ‌కులు వెంట‌నే వాలిపోయారు. అర్థంప‌ర్థం లేని ధ‌ర్నాల‌తో హ‌డావుడి చేసి వెళ్లారు.

అంత‌కుముందు ప్ర‌కాశం జిల్లా టంగుటూరు మండ‌లం రావివారిపాలెంలోనూ ఇదే తంతు.. కుటుంబ త‌గాదాల‌తో ఎస్సీ మ‌హిళ హ‌త్య జ‌రిగింది. కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. జైలుకు కూడా వెళ్లిన ఘ‌ట‌న‌లున్నాయి. వివాదం కోర్టు ప‌రిధిలోనూ ఉంది. ఈ క్ర‌మంలో నెల రోజుల క్రితం రెండు కుటుంబాల మ‌ధ్య మ‌రోసారి గొడ‌వ జ‌రిగింది. త‌న త‌ల్లిని అవ‌మానిస్తున్నారంటూ ఓ యువ‌కుడు త‌న బంధువులపైనే దాడికి దిగాడు. ట్రాక్ట‌ర్ తో మ‌హిళ‌ను తొక్కించాడు. ఆ కేసులోనూ నిందితుల‌ను పోలీసులు వెంట‌నే అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది.

ఏ ఒక్క ఘ‌ట‌న‌లోనూ నిందితుల‌కు ఎక్క‌డా కూడా పార్టీ కానీ, ప్ర‌భుత్వం కానీ అండ‌గా నిల‌వ‌లేదు. నిందితుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. సంబంధంలేని హ‌త్య‌ల‌కు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వాన్ని బాధ్యుడ్ని చేసి బుర‌ద‌జ‌ల్లాల‌నే కుఠిల‌ ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ అడుగడుగునా విషం చిమ్ముతోంది .

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు నేరస్తుల‌కు అండ‌గా ఉన్నాడు

చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు నాగార్జున యూనివ‌ర్సిటీలో రిషితేశ్వ‌రి అనే విద్యార్థిని ర్యాగింగ్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోతే ప్రిన్సిప‌ల్ బాబూరావు చౌదరి మీద కేసు పెట్ట‌లేదు. చివ‌రికి ప్ర‌జా సంఘాల నుంచి తీవ్ర‌మైన ప్ర‌తిఘ‌ట‌న రావ‌డంతో కేసు పెట్టాల్సి వ‌చ్చింది.

అక్ర‌మంగా ఇసుకు త‌ర‌లిస్తున్న ఆనాటి దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ చౌద‌రిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వ‌న‌జాక్షిని ఇసుక‌లో ప‌డేసి కొడితే చింత‌మ‌నేని మీద కేసు న‌మోదు చేయ‌లేదు. పైగా ఎమ్మార్వోదే త‌ప్పంటూ చంద్ర‌బాబు పెద‌రాయుడి తీర్పు చెప్పాడు..

కోవిడ్ స‌మ‌యంలో ర‌మేశ్ ఆస్ప‌త్రి లీజుకు తీసుకున్న స‌ర్వ ప్యాలెస్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జ‌రిగి 10 మంది రోగులు చ‌నిపోతే ప్ర‌భుత్వం ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మీద క‌నీస జాగ్ర‌త్త‌లు పాటించ‌లేద‌ని కేసు న‌మోదు చేసింది. దానికి చంద్ర‌బాబు మాత్రం ఇదంతా క‌మ్మ వారి మీద జ‌రుగుతున్న దాడిగా అభివ‌ర్ణించాడు..

ఇలా ప్ర‌తి సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబు కులాల‌ను చూసి త‌మ కులం వారికి కొమ్ము కాశాడే త‌ప్ప‌… బాధితుల ప‌క్షాన నిలిచిన పాపాన‌పోలేదు. కానీ జ‌గ‌న్ మాత్రం కుల‌మ‌తాల‌కు అతీతంగా బాధితుల ప‌క్షాన నిలిచి వారిని ఆదుకుంటున్నాడు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!