Sunday, September 8, 2024

వరుస విజయాలు సాధిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేపై అభ్యర్థిని ఫిక్స్ చేసిన జగన్

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యేపై అభ్యర్థిని ఫిక్స్ చేసిన జగన్… ఈసారి అయిన గెలుస్తారా..?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు వైసీపీ అధినేత జగన్. మరోసారి అధికారంలోకి రావడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీనిలో భాగంగానే వరుసగా పార్టీ నాయకులతో సమావేశం అవుతూ వారిని చైతన్యపరుస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే… మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని నాయకులకు భరోసా కూడా కల్పిస్తున్నారు. తనతో పాటు పార్టీ నాయకులకు కూడా రాబోవు ఎన్నికలు చాలా కీలకం అని హితభోద చేస్తున్నారాయన. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ హవాలో కూడా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారాయన. దీనిలో భాగంగానే మొదటగా ఆ నియోజకవర్గలకు సంబంధించిన అభ్యర్థులను ఫిక్స్ చేసుకుంటూ పోతున్నారు. కుప్పంలో భరత్‌ను తొలి అభ్యర్థిగా ప్రకటించిన జగన్.. అద్దంకిలో గొట్టిపాటి రవి కుమార్‌ను ఓడించడానికి బాచిన కృష్ణచైతన్యకు సీటును కేటాంచారు.

తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యేపై అభ్యర్థిని జగన్ ఫిక్స్ చేశారు. ఆ అభ్యర్థి మరెవ్వరో కాదు..తోట త్రిమూర్తులు. అవును తోట త్రిమూర్తులును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడానికి జగన్ రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసిన తోట త్రిమూర్తులు ఓడిపోవడం జరిగింది. తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎమ్యెల్సీ కూడా అయ్యారు. అయితే తోట త్రిమూర్తులును వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలని పార్టీ అధినేత యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేయనున్నట్లు సమాచారం. మండపేట నియోజకవర్గం నియోజకవర్గంలో టీడీపీ వరుసగా విజయం సాధిస్తు వస్తోంది. గత ఎన్నికల్లో వేగుళ్ల జోగేశ్వర రావు టీడీపీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ తరుఫున పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోవడం జరిగింది.

మండపేట నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను ప్రస్తుతం తోట త్రిమూర్తులునే చూసుకుంటున్నారు. ఆయన్ను అక్కడ నుంచే పోటీ చేయించాలని చూస్తున్నారు. కాని తోట త్రిమూర్తులు
సొంత నియోజకవర్గం మాత్రం రామచంద్రాపురం. 2019లో జరిగిన ఎన్నికల్లో తోట త్రిమూర్తులు మీద చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈక్రమంలో రామచంద్రాపురం టిక్కెట్ తోట త్రిమూర్తులు దక్కదు. కాబట్టి..ఆయన్ను మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తుంది. అందుకే ముందుగానే తోట త్రిమూర్తులుకు మండపేట నియోజకవర్గం బాధ్యతలను అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతుంది. . వచ్చే ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ అభ్యర్ధిగా తోట త్రిమూర్తులు పోటీ చేయడం దాదాపు ఖాయం. ఇదే విషయాన్ని సమీక్ష సమావేశంలో జగన్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలని ఇప్పటికే త్రిమూర్తులకు సీఎం జగన్ నిర్దేశించారట. మరి టీడీపీ తరుఫున వరుసుగా విజయాలు సాధిస్తున్న వేగుళ్ల జోగేశ్వర రావును తోట త్రిమూర్తులు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!