Tuesday, April 23, 2024

జగన్ సంచలన నిర్ణయం… మంత్రికి బొత్సకు షాక్ ఇస్తూ…?

- Advertisement -

ఎన్నికలు దగ్గరపడే కొద్ది వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యర్థులకు చెక్ పెడుతూ పలు నిర్ఱయాలు తీసుకున్నారాయన. పవన్ , చంద్రబాబులు కలిసి వచ్చిన , విడివిడిగా వచ్చిన ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారు జగన్. దీనిపై ఇప్పటికే పక్క ప్రణళికతో ముందుగు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుసూ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగనే.. సొంత పార్టీ నేతలపై కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన వెనకాడటం లేదని తెలుస్తుంది. ఇప్పటికే కొందరు నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కొందరిని ఎంపీలుగా పోటీ చేయించడానికి కూడా జగన్ సిద్దం అవుతున్నారని విశ్వసనీయ సమాచారం.

దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా దర్శనం ఇస్తున్నారని తెలుస్తుంది. హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి..ఆయన స్థానంలో…ఉషా శ్రీచరణ్‌ను హిందుపురం ఎంపీగా పోటీ చేయిచాలని జగన్ భావిస్తున్నారట. ఇదే సమయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉత్సహపడుతున్నారని తెలుస్తుంది. దాదాపు ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం అని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మంత్రి బొత్స కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని తెలుస్తుంది.

ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజికవర్గం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్నారు. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో విజయనగర ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు జగన్. చీపురుపల్లి నియోజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా బొత్స కుటుంబం నుంచి ఒకరికి టిక్కెట్ ఖాయం చేసి. బొత్సను ఎంపీగా బరిలోకి దింపాలని పార్టీ అధినేత చూస్తున్నారట. ఇటు బొత్స కూడా ఎంపీగా పోటీ చేయాడానికి ఓకే అన్నారని సమాచారం అందుతుంది. దీనిని బట్టి చూస్తే… వచ్చే ఎన్నికల్లో భారీ మార్పులకు జగన్ శ్రీకారం చూట్టినట్లుగా కనిపిస్తుంది. మరి 2024 ఎన్నికల్లో ఎవరు ఎలా పోటీ చేస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!