Friday, July 19, 2024

అనంతపురంలో పరిటాల కుటుంబం బరితెగింపు ..మరో రక్త చరిత్ర సృష్టించాలని ప్లాన్..?

- Advertisement -

మరో రక్త చరిత్రకు పరిటాల కుటుంబం ప్లాన్..? అనంతపురంలో టీడీపీ బరితెగింపు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరోమారు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పరిటాల కుటుంబం తెరలేపారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పరిటాల కుటుంబం పెట్టింది పేరుగా ఉండేది. 2019 ఎన్నికల్లో పరిటాల కుమారుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల సునీత తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. కొడుకు పరిటాల శ్రీరామ్‌ను ధర్మవరం నుంచి బరిలోకి దించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రెండు నియోజకవర్గాలు తమ అధీనంలో ఉండేలా చూసుకుంటూ..నిత్యం ఏదో రకంగా గొడవలను సృష్టించడానికి పరిటాల కుటుంబం ప్రయత్నిస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబంపైన ఆధారలేని ఆరోపణలు చేస్తూ బెదిరింపులతో అనుకూలమైన పత్రికలలో, సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సబబుకాదని పరిటాల కుటుంబ సభ్యులకు వైసీపీ నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిని, వదినను, ఇతర కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురిచేసేలా పరిటాల కుటుంబ సభ్యులు దుష్పప్రచారం చేయడం, బెదిరింపు దోరణితో మాట్లాడటం సహించలేక సహనం కోల్పోయిన తోపుదుర్తి చందు టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు చేశారని వారు గుర్తు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ పరిటాల కుటుంబం తోపుదుర్తి ప్రకాష్ మీద, అలాగే కుటుంబ సభ్యులపై నిరాధరమైన పసలేని ఆరోపణలతో వారి అనుకూల పత్రికల్లో, సోషల్ మీడియల్లో నిందారోపణలుచేస్తూ వస్తున్నారు.

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా రాప్తాడు నియోజకవర్గం అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్నన పొందుతుండడం మీరు జీర్ణించుకోలేకనే టీడీపీ నాయకులు ఇలా నిందలు వేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధికోసం వ్యవసాయాన్ని బలోపే తం చేస్తూ పేరూరు డ్యామ్ కు కృష్ణా జలాలు తేవడం మీకు కనబడలేదా, సొంత నిధులతో రైతులకు బోర్లు వేయించడం, మహిళల సంఘాలకు సొంత ఖర్చులతో పాలడైరీని ఏర్పాటు చేస్తుండడం కనిపించడం లేదా అని టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని తరిమికొట్టి అభివృద్ధి వైపు గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జీవనాధారాన్ని చూపిస్తుంటే పరిటాల కుటుంబం మాత్రం ఫ్యాక్షన్ వైపు ప్రజలను మళ్లిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రజలకు బాగా అర్థమైందనే విషయాన్ని కూడా మీరు గ్రహించలేకపోతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.

టీడీపీ వారు ఓడిన బాధల్లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సహనం వహించామని… పరిటాల శ్రీరామ్ గతంలో వైయస్సార్ విగ్రహాలను పగలగొట్టించిన ఇలాగే అడ్డు వచ్చిన వారి తలలు కూడా పగలగొడతామనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వీటి అన్నింటిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు విని సహనంతో ఉన్నారన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న గౌరవంతో సైలెంట్‌గా ఉన్నామని లేకపోతే ఇక్కడ ఎవరు మీరు భయపెడితే భయపడే వారు ఎవరు లేరన్నారు. మా పార్టీ నినాదం ప్రజలకు చేయడం, దీన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జిల్లాలో పాటిస్తూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గత ఆరు నెలలుగా నిర్వహిస్తూ ప్రజలతోనే ఎల్లప్పుడు ఉంటున్నారన్నారు.

ఇంకా ఎమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువ కావడం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతామోనని ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారన్నారు. నోటికొచ్చినట్లు ఎమ్మెల్యేలను, అధికారులను బెదిరించాలని టీడీపీ నాయకులు చూస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తప్పుడు కేసులు బనాయించి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని బెంగళూరు జైలుకు పంపించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఆ సమయంలో దొంగ ఓట్లతో పరిటాల సునీత గెలిచారనే విషయాన్ని వైసీపీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా పరిటాల సునీతమ్మ పరిటాల శ్రీరామ్, ఆరోపణలు చేయడం మాని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. అంతే కాని రాప్తాడు ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా మాట్లాడితే తగ్గట్టుగానే వైసీపీ నాయకులు కూడా సమాధానం చెబుతామని అంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!