Thursday, December 12, 2024

జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన బ్రదర్ అనిల్

- Advertisement -

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనే హాట్ టాపిక్‌గా మారారు. తెలంగాణ పోలీసులు వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో పాటు, ఆమె బస చేస్తున్న బస్సుకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టడం జరిగింది. దీంతో వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, దీనిపై వైఎస్ షర్మిల షర్మిల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో… అక్కడ ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి. పరిస్థుతులు చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకుని ఆమెను లోటస్‌పాండ్‌లోని తన ఇంటివద్ద వదిలారు. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో ఆమెకు తీవ్ర గాయ్యాలైయాయి. దీంతో వైఎస్ షర్మిల వెంటనే ప్రగతి భవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించడానికి .. ఆమెను మళ్లీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి.

వైఎస్ షర్మిల కారుని క్రేన్ తో సహా లాగి అరెస్ట్ చేయడం మాత్రం హైలెట్ అనే అనాలి. ఇది నేషనల్ మీడియాలో కూడా వైరల్ అయింది. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడంపై ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మొదలగువారు స్పందించారు. అయితే షర్మిల అరెస్ట్‌పై వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు మాత్రమే స్పందించారు. అది కూడా ఏపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తి అయిన సజ్జల రామకృష్ణరెడ్డి మాత్రమే షర్మిల అరెస్ట్‌పై మాట్లాడారు. అయితే దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందిస్తారని….చాలామంది ఎదురు చూశారు. కాని ఆయన షర్మిల అరెస్ట్‌పైపై మాట్లాడింది లేదు. దీంతో జగన్ మీద తల్లి విజయమ్మ, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

షర్మిల భర్త బ్రదర్ అనిల్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం హైదరాబాద్కు రావచ్చని అన్నారు. అన్నయ్య కదా షర్మిల కోసం వస్తాడు అనుకుంటా అని బ్రదర్ అని చెప్పుకొచ్చారు. ఇక షర్మిల అరెస్ట్ అయ్యారు కదా.. జగన్ ఇక్కడకు వస్తారా అని అడగ్గా.. దీనిపై తల్లి విజయమ్మ స్పందిస్తూ..పక్క రాష్ట్రం సీఎంకి దీంతో ఏంటి సంబంధం అన్నట్లుగా విజయమ్మ మాట్లాడారు. ఈ సమయంలో విజయమ్మ ఎక్కడ కూడా తన కొడుకు, షర్మిల అన్న అని కూడా సంభోదించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి చూస్తే షర్మిల అరెస్ట్ కాదు కానీ జగన్ మీద ఇండైరెక్ట్‌గా వత్తిడి పెరుగుతోందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!