Thursday, April 25, 2024

2024 ఎన్నికల్లో టీడీపీ పక్కాగా ఓడిపోయే నియోజకవర్గాలు ఇవే

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రలైనా పన్ని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. రాబోవు ఎన్నికలను చాలా ప్రతిష్టత్మంగా తీసుకున్నారాయన. ఈసారి గెలవకపోతే.. మళ్లీ ఎప్పటికి టీడీపీ అధికారంలోక రాదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎంతకు తెగించి అయిన … మరోసారి సీఎం కావాలని ప్రయత్నిస్తున్నారు. దీని కోసం మరోసారి బీజేపీతో, జనసేనతో కలిసి ప్రయణించాలని చూసినప్పటికి కూడా .. చంద్రబాబును బీజేపీ పెద్దలు నమ్మడం లేదు. పవన్ కల్యాణ్ చెప్పినప్పటికి కూడా బీజేపీ నాయకులు వినే పరిస్థితి లేదని.. మొన్న జరిగిన మోదీ సమావేశంతో అందరికి అర్థం అయింది.

బీజేపీని కాదని..పవన్ కూడా టీడీపీతో జతకట్టలేని పరిస్థితి ఇవన్ని కలగలిసి చంద్రబాబును మరోసారి ఒంటరిని చేసింది. సరే పోని ఒంటరిగానే పోటీ చేద్దామని చూస్తే…సింగిల్‌గా వెళ్తే గెలిచిన చరిత్ర టీడీపీకి ఒక్కసారి కూడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే అధినేత ఆరాటమే తప్ప.. నాయకుల పోరాటం మాత్రం టీడీపీలో కనిపించడం లేదు. టీడీపీ ఒంటరిగా వెళ్లిన లేక ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా ఆ పార్టీ ఖచ్చితంగా ఓడిపోయే స్థానాలు కొన్ని ఉన్నాయట. ఆ స్థానాల్లో గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇంతకి టీడీపీ ఓడిపోయే నియోజకవర్గాలు ఏమిటో మనం కూడా ఓసారి పరిశీలిద్దాం.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం, కడప జిల్లా ప్రొద్దుటూరు ,మైదుకూరు , రైల్వేకోడూరు నియోజకవర్గాలు, కర్నూల్ డోన్ నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో తిరువూరు, గోపాలపురం, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, గుంటూరు పశ్చిమ, అనకాపల్లి, ఉదయగిరి, కావలి, దర్శి, నగరి ఇలా పలు నియోజకవర్గాలు టీడీపీ గెలిచే అవకాశం ఉనప్పటికి కూడా టీడీపీలో అధిపత్య పోరు కారణంగా ఈ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరి ఇటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారో అని తెలుగు తమ్ముళ్ల అతృతుగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!