YSRCP: మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది ఏపీలో గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా వెల్లడించింది. జగన్ సుభిక్షమైన పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతటి వైభవాన్ని చూశారో, వైసీపీ హయాంలో అభివృద్ధి పథంలో ఎలా ముందుకు సాగిందో నిరూపించేలా తాజా ప్రకటన సాక్ష్యంగా నిలుస్తోంది. కరోనా లాంటి విపత్తు తర్వాత పెట్టుబడులను ఆకర్షించడం, వాస్తవ రూపంలోకి తేవడం.. అంతేకాకుండా వాటిని ప్రతి పేదింటికి అందేలా జగన్ చర్యలు చేపట్టడంలో దూకుడును ప్రదర్శించినట్లు డీపీఐఐటీ గణాంకాలు చెబుతున్నాయి.
డీపీఐఐటీ తాజా నివేదిక ప్రకారం.. కరోనా విపత్తు ముగిసిన అనంతరం 2021 నుంచి ఈ ఏడాది మే వరకు రాష్ట్రంలో కొత్తగా 171 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.61,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో మరో 179 భారీ పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తులు ప్రారంభించాయి. ఈ లెక్కన గడిచిన మూడున్నరేళ్ల కాలంలో రూ.76,278 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో అత్యధికంగా 2022లో రూ.45,301 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తేవడం ద్వారా దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదని జగన్ పారిశ్రామిక ప్రగతివైపు దృష్టి సారించడం ఇంతటి ఘనకీర్తికి కారణం. ఇదే సమయంలో 34 ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.4,908 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇవి కాకుండా 2023లో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు వాస్తవ రూపంలోకి వస్తున్నాయని డీపీఐఐటీ తాజాగా ప్రకటన చేయడంతో గత ఐదేళ్ల కాలంలో పారిశ్రామికంగా ఏపీని అందనంత ఎత్తులో నిలబెట్టిన జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తున్నాయి