వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి రాజకీయ జీవితం తుది దశలో ఉందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం.. ఇప్పుడు జిల్లాలో ఏకాకిగా మారారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు, జిల్లాలో తన పట్టును నిలుపుకున్నారాయన. ముఖ్యంగా వైఎస్ఆర్ హయంలో రాజకీయ నాయకుడుగా ఎదిగారు. వైఎస్ఆర్ ఆనం రాం నారాయణ రెడ్డికి చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. జిల్లా బాధ్యతలతో పాటు, మంత్రి పదవిని కూడా అప్పగించారు. కాని వైఎస్ఆర్ మరణం తరువాత ఆనం రాం నారాయణ రెడ్డి అయోమయంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో..ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కాని అక్కడ కూడా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో…మరొ దిక్కులేక.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనం రాం నారాయణ రెడ్డి వైసీపీలో చేరడం.. ఎమ్మెల్యే అవడం.. మంత్రి రాకపోవడంతో.. పార్టీ మీదనే విమర్శలు చేయడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. వైసీపీలో ఆనం రాం నారాయణ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయినట్లే అని అందరు భావిస్తున్నారు. ఆయన కూడా వైసీపీలో తనకు టికెట్ వస్తుందని పెద్దగా ఆశలు కూడా పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఆనం తరుఫున రాయభారం నడిపినప్పటికి కూడా లాభం లేకుండా పోయింది. ఆనం రాం నారాయణ రెడ్డి స్థానంలో నియోజకవర్గ ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది.
తాజాగా జగన్ సర్కార్ మరొ నిర్ణయాం తీసుకుంటూ ఆనం రాం నారాయణ రెడ్డికి కీలక సందేశాన్ని పంపించడం జరిగింది. జీఎస్‌డబ్ల్యూఎస్ కమిషనర్ నుంచి ఒక సందేశం అందింది. అందులో.. ‘గడపగడపకు’లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు సందేశం వచ్చింది. దీని ద్వారా ఇక రానున్న రోజుల్లోనూ గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆనం హాజరు కావాల్సిన అవసరం లేదనే విధంగా ఈ సందేశం ఉందని ఆనం మద్దతు దారులు బావిస్తున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు కూడా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణమాలను గమనిస్తూ.. నెమ్మదిగా ఆనం రాం నారాయణ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌గా వచ్చిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి కార్యకర్తలు దగ్గరైయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు ఆనం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. దీంతో, పార్టీ శ్రేణులు అధినాయకత్వం మూడ్ గుర్తించి ఆనంతో దూరంగా ఉంటున్నారు.ఆయన టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.