Tuesday, October 8, 2024

Jagan-Chandrababu: ‘టార్గెట్ జ‌గ‌న్‌’.. ఇదే చంద్రబాబు మంత్రం

- Advertisement -

Jagan-Chandrababu: ‘టార్గెట్ జ‌గ‌న్‌’.. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ వైఖరి. చంద్ర‌బాబు ఎప్పుడు మాట్లాడినా.. తాను చేసింది, చేయాల్సింది చెప్పుకోవాల్సింది పోయి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూనే రాజ‌కీయాలు చేస్తున్నారు. జ‌గ‌న్‌ను విమర్శించడం, ప్రజలు స‌మ‌స్య‌లు చెప్పుకుంటే అండగా ఉంటానని భరోసా ఇవ్వడం మాని దానికి మూలకార‌ణం జ‌గ‌నే అని తప్పించుకోవడం చంద్రబాబుకు పరిపాటి అయిపోయింది. ఇటీవల భారీ స్థాయిలో విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద‌లు వస్తే.. దానికి కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదమే అని చెప్పడం మనం చూశాం. బుడ‌మేరు గండ్లు పూడ్చ‌లేద‌ని.. ఐదేళ్ల పాల‌న‌లోవైసీపీ అధినేత వైఎస్ జగన్ నిద్ర పోయార‌ని అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసం? ఏలేరు రిజర్వాయర్‌కు భారీ నీరు చేరి చుట్టుపక్కల ఊళ్లు మునిగిపోతే.. మళ్లీ జ‌గ‌నే కార‌ణం అని తప్పుకోవడం ఇలాంటి వ్యాఖ్యలు వింటుంటే చేతకాని ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసిందని స్పష్టం అవుతోంది. కృష్ణాన‌దిలో ప‌డ‌వ‌లు కొట్టుకు వ‌చ్చిన ఘ‌ట‌న వెనక కూడా వైసీపీ నేత‌ల హస్తం ఉందనేది చంద్ర‌బాబు తాజా ఆరోపణ. ఇదంతా గమనిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏం జ‌రిగినా అంతా జ‌గ‌న్ నామస్మ‌ర‌ణే.

మరి, అదే ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తే జగన్ ప్రశ్నిస్తే మాత్రం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. మ‌రి ఇలా.. అన్నింటికీ జ‌గ‌న్ టార్గెట్ కావ‌డానికి అసలు రీజ‌నేంటి? అనేది ప్రస్తుతం ఆస‌క్తిగా మారింది. కానీ, జ‌గ‌న్ రాజ‌కీయంగా ఓడిపోయినా.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మాత్రం ఆద‌ర‌ణ ఎప్పటికీ తగ్గలేదు అనుకోవడం వాస్తవం. అంత భారీ వ్య‌తిరేక‌త‌లోనూ వైసీపీకి న‌ల‌భై శాతం ఓటు బ్యాంకు ద‌క్కిందంటే.. జ‌గ‌న్‌కు ప్రజల్లో ఉన్న అభిమానం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు కూట‌మిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. అందుకే ప్రతి విషయంలో జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకుని.. రాష్ట్రంలో ప్ర‌త్య‌ర్థి అంటూ ఎవ‌రైనా ఉంటే అది జ‌గ‌నే అన్న‌ట్టుగా చంద్రబాబు ‘టార్గెట్ జ‌గ‌న్’ మంత్రాన్ని ఆచరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!