Sunday, September 8, 2024

It’s Time to RRR విచార‌ణ‌కు వేళైంది ర‌ఘురామ‌…!

- Advertisement -

ఏదో చేద్దామని అనుకుంటే చివరికి ఏదో అయినట్లుగా ఉంది వైసీపీ వివాస్పద ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరిస్థితి. ఎల్లో మీడియాతో, టీడీపీ నాయకులతో చేతులు కలిపి జగన్‌ను ఇబ్బందిపాలు చేద్దామని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రయత్నించారు. కాని చివరికి ఆయనే ఇబ్బందుల్లో పడటం చూసి కాలం కూడా జాలిపడుతున్నట్లు అనిపిస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యే కొనుగొలు కేసులో అనుహ్యంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరు తెర మీదకు రావడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వన్ని కూల్చివేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే.. ఫాం హౌస్ లో చోటు చేసుకున్న ఎమ్మెల్యేలతో బేరసారాలకు బీజేపీ పెద్దలు కొందరిని రంగంలోకి దించిందని..వారిని తాము రెడ్ హ్యాండెంట్‌గా పట్టుకున్నామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

దీనిపై కేసీఆర్ కూడా మీడియా సమావేశం పెట్టి… మరి సంబంధించిన వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేసారు. సుప్రీం – అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలకు వీటిని పంపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు కోసం విచారణకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ నేత బీఎల్ సంతోష్ కుమార్ బయటకు వచ్చింది. ఈ కేసులో ఆయన హాజరుకావాలని బీఎల్ సంతోష్ కుమార్‌కు నోటీసులు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగానే వైసీపీ వివాస్పద ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరు కూడా దీనిలో బయటకు రావడం సంచలనంగా మారింది. రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఫాంహౌస్ కొనుగోళ్ల నిందితులను కలిశారనే ఆరోపణలతోనే విచారణకు రావాలని 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

రఘురామ కృష్ణంరాజు ఈ రోజు సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కాంప్లెక్స్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి రఘురామ కృష్ణంరాజు వెళ్లాల్సి ఉంటుంది. ఆయన హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే జగనే నాకు కావాలని నోటీసులు ఇప్పించారని రఘురామ కృష్ణంరాజు చెప్పడం విశేషంగా మారింది. ఐపీఎస్ ఆఫీస‌ర్ స్టెఫెన్ ర‌వీంద‌ర్‌కు జగన్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. జగన్ చెప్పినట్లుగానే స్టెఫెన్ ర‌వీంద‌ర్‌ నడుచుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపణలు చేశారు. దీని ద్వారా తాను సచీలుడునే అని మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తనికి ఈ కేసులో రఘురామ కృష్ణంరాజు పేరు కూడా బయటకు రావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగొలు కేసు హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!