తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉందా ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో అధిష్టానం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ తరఫున బూరుగుపల్లి శేషారావు ఇన్చార్జిగా ఉన్నారు… ఈయన 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు.. ఇక 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూశారు… కానీ ఆయన హ్యాట్రిక్ కు బ్రేకులు పడ్డాయి… సుమారు 20వేల మెజార్టీతో ఆయన ఓటమి చెందారు ఇక ఆ తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటూ వస్తున్నారు… దీంతో నిడదవోలులో వీధికో వివాదం రోజుకో సమస్యగా మారింది ఈ క్రమంలో టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయట.. వచ్చే ఎన్నికల్లో బూరుగుపల్లి శేషారావు కు కాకుండా ఎవరికైనా టికెట్ ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడుని కోరారట… ఎన్నికల నాటికి జనసేనతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి టికెట్ ఇచ్చినా తాము స్వాగతిస్తామని తేల్చి చెప్పారట… బూరుగుపల్లికి మాత్రం టికెట్ ఇవ్వవద్దని నిడదవోలు తెలుగు తమ్ముళ్లు అధిష్టానాన్ని కోరుచున్నారట మరి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి