Saturday, October 5, 2024

చెల్లెలు షర్మిలని పరామర్శించిన వైఎస్ జగన్

- Advertisement -

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తపార్టీ ప్రకంపనలు స‌ృష్టిస్తుంది. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి.తెలంగాణలో ఆమె వైఎస్సార్టీపీ పార్టీ బాలోపేతానికి కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే..ఆమె తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో షర్మిల ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.. షర్మిల చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..వైఎస్ షర్మిలను అదుపులోకి ఈ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు వైఎస్ షర్మిల బస చేస్తున్న బస్సుపై దాడికి దిగి.. దానికి పెట్రోల్‌తో నిప్పటించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు వైయస్సార్టీపీ నేతల వాహనాలపై దాడులు చేశారు. రాళ్ల దాడి చేశారు. షర్మిల ప్రయాణించే కేరవాన్‌కు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. కొంత మంది దుండగులు బస్సును తగలబెడితే వాళ్లని అరెస్టు చేయకుండా తనను ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్‌లో పడేశారని మండిపడ్డారు. పోలీసుల తోపులాటలో తగిలిన గాయాలను చూపించారు. ఈరోజు తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందని షర్మిల అన్నారు.

వైఎస్ షర్మిలకు గాయాలు అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైఎస్ఆర్ అభిమానులు… భారీ ఎత్తున స్పందిస్తున్నారు. ఆడ కూతురు మీద ఇలాగానే ప్రవర్తించేది అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చెల్లెలు షర్మిలకు గాయం అయిందనే విషయం తెలుసుకున్న జగన్…ఆమెను ఫోన్లో పరామర్శించారని తెలుస్తోంది. చెల్లెలు షర్మిల బాగోగులతో పాటు , ఫ్యామిలీ డాక్టర్‌తో కూడా జగన్ మాట్లాడటం జరిగింది. రాజకీయాలలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని.. పూలతో పాటు, ముళ్లు కూడా ఉంటాయని షర్మిలకు జగన్ సూచించినట్లుగా వైఎస్ కుటుంబ సభ్యులు ఒకరు తెలిపారు. దీంతో పాటు చెల్లెలు షర్మిలకు సంబంధించిన సెక్యూరిటీ వివరాలు కూడా జగన్ అడిగి తెలుసుకున్నారట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!