సూపర్ స్టార్ కృష్ఱ ఇటీవలే మరణించిన సంగతి అందరికి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాలేకపోవడంతో..కృష్ణ మరణించారు. సూపర్ స్టార్ కృష్ఱ అటు సినిమాలతో పాటు, రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.కృష్ణ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగానే పని చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా కూడా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన బహిరంగంగానే వైసీపీ అధినేత జగన్‌కు మద్దతిచ్చారు. తాజాగా ఓపెన్ విత్ ఆర్కే ప్రొగ్రామ్‌కు కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గెస్ట్‌గా విచ్చేశారు. ఈ సమయంలో సినిమా విశేషాలతో పాటు, రాజకీయా విషయాలను కూడా ఆయన ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.
దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..సూపర్ స్టార్ కృష్ఱ రాజకీయాల్లో అతి కొద్ది కాలమే ఉన్నారు.కాని ఆయన తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాత్రం చాలా కాలం పాటు రాజకీయాల్లో కొనసాగారు. ఆయన తొలుత టీడీపీలో ఉన్నారు. జగన్ వైసీపీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి గుంటూరు తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డారు. వెంటనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆదిశేషగిరిరావు ప్రకటించారు. వెంటనే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాని అక్కడ కూడా సీటు హామీ ఇవ్వకపోవడంతో.. నిరాశగా వెనుతిరగారు. అయితే చాలామంది ఆదిశేషగిరిరావు టీడీపీలోనే ఉన్నారని అందరు భావిస్తున్నారు. కాని తాజాగా దీనిపై ఆదిశేషగిరిరావు క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేనని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణగారు ఆఖరి రోజుల్లో తాజాగా జరుగుతున్న రాజకీయాలపై ఏమైనా స్పందించారా అని ఆదిశేషగిరిరావును ఏబీఎన్ ఆర్కే ప్రశ్నించారు. అన్నయ్య కృష్ణ రాజకీయాలను ఎక్కువుగానే ఫాలో అవుతుంటారని.. ఆదిశేషగిరిరావు చెప్పుకొచ్చారు. జగన్ తప్పులు చేస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు ప్రజలకు వివరించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని కృష్ణ తెలిపేవారని ఆదిశేషగిరిరావు వెల్లడించారు. ప్రజల తరుఫున పోరాటాలు చేసినప్పుడే ఎన్నికల్లో విజయం సాధిస్తారని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సరిగ్గా జగన్ ఇదే చేసి చూపించారని కృష్ణ తెలిపేవారని ఆదిశేషగిరిరావు చెప్పుకొచ్చారు. చంద్రబాబులో అది లేదని..ఎప్పుడు పవన్ కల్యాణ్ అంటాడని.. అలా అయితే ఎలా గెలుస్తారని కృష్ణ అనేవారని ఆదిశేషగిరిరావు చెప్పడం జరిగింది. నాయకుడుకు తన మీద తనకు నమ్మకం లేనప్పుడు పక్క వారి మీద ఆధారపడతారని.. చంద్రబాబుకు సింగిల్‌గా వెళ్తే.. గెలిచే సత్తా లేదని కృష్ణ తన అభిప్రాయంగా చెప్పేవారని ఆదిశేషగిరిరావు ఈ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.