Sunday, September 8, 2024

టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆనం

- Advertisement -

ఆనం రాంనారయణ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు వచ్చే ఎన్నికల నాటి వరకు తాను వైసీపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తనకు టికెట్ ఇస్తానని పోటీ చేస్తానని .. లేకపోతే అప్పుడు నా నిర్ణయం వేరేగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పినట్లు అయింది. ఎమ్మెల్యేగా తన చివరి రోజు వరకు వైసీపీలోనే ఉంటానని ఆనం రాంనారయణ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాష్ట్రా రాజకీయాల్లో ఆనం రాంనారయణ రెడ్డి ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా నెల్లురు జిల్లాలో ఆనం ఫ్యామిలీకి మంచి పట్టుంది. అయితే ఇది అంతా కూడా గతమనే చెప్పాలి. ప్రస్తుతం నెల్లురులో కొత్త నాయకుల హవా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆనం రాంనారయణ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి హయంలో ఆనం రాంనారయణ రెడ్డి మంత్రిగా కూడా పని చేశారు. రాజశేఖరరెడ్డి మరణంతో ఆనం ఫ్యామిలీ పతనం కూడా మొదలైందని అంటుంటారు.

రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరుగున పడటంతో ఆనం ఫ్యామిలీ టీడీపీలో చేరారు. అయితే వారిని పార్టీలో చేర్చుకున్నప్పటికి టిక్కెట్‌ను మాత్రం కేటాయించలేదు చంద్రబాబు. అయినప్పటికి టీడీపీలోనే కొనసాగారు ఆనం ఫ్యామిలీ. అయితే పార్టీలో నాయకులు చులకనగా చూడటంతో టీడీపీలో ఇమడలేక పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమయంలోనే ఆనం వివేకానంద రెడ్డి మరణంతో రాజకీయాల్లో ఒంటరైయ్యారు ఆనం రాంనారయణ రెడ్డి. తరువాత ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటికి ఆనంకు మంత్రి పదవి మాత్రం రాలేదు. జగన్ మొదటి నుంచి తనతో ఉన్నవారికి మాత్రమే మంత్రి పదవులు అప్పగించారు. దీంతో మంత్రి పదవి ఆశించిన ఆనంకు భంగపాటు తప్పలేదు. వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆనంకు , జగన్ ప్రభుత్వంలో మాత్రం సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇక సమయంలో జిల్లా మంత్రి ఒకరు తనని బాగా ఇబ్బంది పెడుతున్నారనే తెగ ఫీలైపోతున్నారట ఆనం. జగన్ మొదటి నుంచి కూడా ఆనంను దూరం పెట్టినట్లుగానే కనిపిస్తుంది.

జిల్లాలో కాకాణి, అనిల్ కుమార్ యాదవ్‌లు మొదటి నుంచి పార్టీలో ఉండటంతో..వారికే జగన్ ప్రాముఖ్యత ఇస్తు వస్తున్నారు. మంత్రి పదవులు కూడా వారినే వరించాయి. దీంతో ఆనం వర్గం అసంతృప్తిగా గురైంది. అప్పటి నుంచి కూడా ఆనం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారని పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో ఆయన పార్టీ మార్పు వార్తలు కూడా తెర మీదకు వచ్చాయి. కాని దీనిపై ఆయన ఎప్పుడు కూడా స్పందించింది లేదు.కాని తాజాగా తొలిసారి పార్టీ మారడంపై ఆనం మాట్లాడటం జరిగింది. తనకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేందుకే టికెట్ ఇచ్చారని, ఈ ఐదు సంవత్సరాల చివరి రోజు వరకు వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, వెంకటగిరి అభివృద్ధిపై అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్న చివరి రోజు వరకు నియోజకవర్గానికి న్యాయం చేయడానికే తాను ప్రయత్నిస్తానన్నారు. ఆయన మాటలు చూస్తుంటే.. ఎన్నికల వరకు వైసీపీలోనే ఉంటానని .. తరువాత పరిస్థుతులను బట్టి స్పందిస్తానని చెప్పడంతో.. ఆనం వైసీపీలో ఇమడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఆనం రాంనారయణ రెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!