బండ్ల గణేష్ పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు ఇది. అటు సినిమా వర్గాల్లోను.. ఇటు రాజకీయ వర్గాల్లోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే సమయంలో బండ్ల గణేష్ తనని తాను మరిచిపోయి మాట్లాడుతుంటారాయన. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను దేవుడుతో పోలుస్తుంటారు. పవన్‌పై ఎప్పటికప్పుడు తన భక్తిని చాటుకుంటున్నారాయన. ఏపీలో పవన్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నా అని చాలా సందర్భాల్లో బహిరంగంగానే తెలిపారాయన.అలాంటి వ్యక్తి తాజాగా జగన్ సర్కార్ గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. జగన్ పాలన అద్బుతంగా ఉందని కితాబిచ్చారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమా నటుడుగా, నిర్మాతగా బండ్ల గణేష్ అందరికి సుపరిచితులే. కాని రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
తెలంగాణలో 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాకపోతే బ్లేడ్‌తో తన పీక కోసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో… అందరు కూడా బండ్ల గణేష్‌ను సోషల్ మీడియా వేదికగా చేసుకుని విమర్శలు చేశారు. నెటిజన్ల దెబ్బకు రాజకీయాలకు గుడ్ బై చెప్పారాయన. అయినప్పటికి కూడా ఎప్పటికప్పుడు రాజకీయాలపై స్పందిస్తున్నారాయన. తాజాగా ఏపీలో జగన్ సర్కార్ మీద ప్రశంసలు కురిపించారు. తనకు తెలిసిన కుటుంబానికి వైద్య సాయం అవసరం అయిందని.. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో తనకు తెలిసినవారికి కాల్ చేయగానే.. దాదాపు కోటి రూపాయిల వరకు సాయం చేశారని చెప్పుకొచ్చారు. అధికారంలో ఎవరు ఉంటే మనకు ఏంటని.. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తే..స్పందించి..రియాక్ట్ అయ్యేవారు ఉంటే చాలని… అలాంటప్పుడు రాజకీయాలతో తనకు పని ఏమిటని బండ్ల గణేష్ ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.