Monday, February 10, 2025

చంద్రబాబు నయా గేమ్.. కుమారుడు పట్టాభిషేకానికి అస్త్రం… అందరూ పాత్రధారులే

- Advertisement -

చంద్రబాబు ఆట మొదలు పెట్టారా? అసలు సిసలు గేమ్ స్టార్ట్ అయిందా? కుమారుడికి పట్టాభిషేకం చేయనున్నారా? ఇదే సరైన సమయమని భావిస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నారా? అందుకే ఈ సరికొత్త నాటకానికి తెర తీశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజిక వర్గం. ఆపై బలమైన మీడియా ఆ పార్టీ సొంతం. ఆ పార్టీతో కమ్మ సామాజిక వర్గానికి విడదీయలేం. ఎల్లో మీడియాను అంతకంటే వేరుగా చూడలేం. పైగా బలమైన పునాదులు వేసుకున్న పార్టీ అది. ఇండియన్ పొలిటికల్ హిస్టరీ లోనే ఒక స్ట్రక్చరల్ గా సాగిన పార్టీ అది. అక్కడ ఏదైనా ఒక పద్ధతిగా సాగుతుంది. ప్రతి ఆలోచన వెనుక ఒక వ్యూహం ఉంటుంది. బలమైన వలయం సైతం ఉంటుంది. చంద్రబాబు అంతలా తీర్చిదిద్దారు పార్టీని. అయితే ఇప్పుడు చంద్రబాబు వయోభారంతో బాధపడుతున్నారు. లోకేష్ కి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. మధ్యలో జనసేన అధినేత పవన్ ఉన్నారు. ఆయనను అధిగమించి ముందుకు వెళ్లడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యం. అందుకే ఎల్లో మీడియాను రంగంలోకి దించారు. ఒక బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపగలిగారు.

లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఎన్ డి ఏ కూటమిలో సరికొత్త కాక రేపుతోంది. లోకేష్ కు పదోన్నతి ఇవ్వాలని పార్టీ సీనియర్లు కోరుతుంటే.. వీలైనంత త్వరగా సీఎం చేయాలని చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ చాలా స్పష్టంగా చెప్పారు. బావి ముఖ్యమంత్రి నారా లోకేష్ అని తేల్చి చెప్పారు. అయితే ఇది ఒక్క భరత్ అభిప్రాయమే కాదు. యావత్ టిడిపి నేతలది ఇదే ఒపీనియన్. ఈ విషయంలో కుటుంబ సభ్యులు సైతం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాలు తెలిసిన వ్యక్తి.. ఆపై అవపోషణ పట్టిన వ్యక్తి కనుక చంద్రబాబు తనదైన రాజకీయం మొదలుపెట్టారు. ముల్లును ముల్లుతోనే తీయాలని భావించారు. ఒక చిన్న పార్టీ సంకేతాన్ని పార్టీ క్యాడర్లోకి పంపించారు. ఒక పద్ధతి ప్రకారం ఎంపిక చేసిన నేతలతో ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అటువంటి ఆలోచన లేదని చెప్పడం కంటే.. ఇకనుంచి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కడ ఖండన లేదు.. కేవలం మాట్లాడవద్దని మాత్రమే ఆదేశాలు ఇచ్చారు.

కొద్దికాలం కిందట పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. మరో పదేళ్లపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని పేర్కొన్నారు. కానీ ఆ ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉంది. ఇప్పట్లో లోకేష్ కు పదోన్నతి లేదని తేల్చి చెప్పడం ఒకటి అయితే.. కుటుంబ సభ్యుల ఒత్తిడి గమనించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఈ ప్రకటన చేసి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఇప్పుడిప్పుడే పదవి వదులుకునే ప్రసక్తి లేదు. ఆయన ఒంట్లో సత్తువ ఉంది. ఆపై పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు. పైగా ఇప్పుడు గాని లోకేష్ ను తెరపైకి తెస్తే జనసేన నుంచి సమస్యలు వస్తాయని చంద్రబాబుకు తెలుసు. అందుకే ముందుగా డిప్యూటీ సీఎం హోదా కట్టబెడితే పవన్ కళ్యాణ్ తో సమాన గౌరవం పొందుతారని.. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలరని.. సమయం వచ్చినప్పుడు ఎల్లో మీడియాతో పాటు పార్టీ అండదండలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయవచ్చని చంద్రబాబు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

నారా లోకేష్ పదోన్నతి పై ప్రచారం మొదలు పెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. అనుకూల ప్రతికూలతలను గమనించడానికే చంద్రబాబు ఈ సంకేతాలను పంపినట్లు అనుమానాలు ఉన్నాయి. ఎల్లో మీడియాతో పాటు ఎంపిక చేసిన నేతల ద్వారా ప్రకటన చేయడం ఒక ఎత్తు అయితే.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించే వారు ఉండవచ్చు కానీ.. వ్యతిరేకించే వారి విషయంలో ఏం చేయాలో చంద్రబాబుకు తెలుసు. అంతెందుకు ఎన్టీఆర్ ఎపిసోడ్ సమయంలో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు చంద్రబాబు. అప్పట్లో లక్ష్మీపార్వతిని బూచిగా చూపించారు. ఆమెపై దుష్ప్రచారం చేయించడం ఒక ఎత్తు అయితే… ఆమె పెత్తనం పెరిగిపోవడంతో పార్టీకి నష్టం అంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. ఆ సమయంలోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు లక్ష్మీపార్వతిని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఈ చిన్న పాయింటును తీసుకొని కద నడిపించారు చంద్రబాబు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తన వైపు తిప్పుకున్నారు. డిప్యూటీ సీఎం పదవి ఆశ చూపి తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును, పార్టీ అధ్యక్ష పదవి ఆశ చూపి కుమారుడు నందమూరి హరికృష్ణకు ఎర వేశారు. కానీ తదనంతర కాలంలో ఆ ఇద్దరు టిడిపిలో లేకుండా పోయారు. దట్ ఇస్ చంద్రబాబు.

చంద్రబాబు నిజంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరా? అంటే స్పష్టంగా ఉంటుందనడంలో అతిశయక్తి కాదు. ఇప్పటికే ప్రకటనలు చేసిన నేతలను గట్టిగా మందలించేవారు. కడపలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ను చేశారు. కనీసం ఆయనను వారించలేదు. మరికొందరు టిడిపి నేతలు కూడా ఇదే డిమాండ్ ను బలంగా వినిపించారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే ఒక ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ అన్ని విధాల అర్హుడని చెప్పుకొచ్చారు. అయినా సరే చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. నేతలను మందలించలేదు. మరోవైపు పార్టీలో వస్తున్న ఈ డిమాండ్ ను లోకేష్ ఆస్వాదిస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒకలా మాట్లాడారు. పవన్ సైతం తనతో సమానమైన నాయకుడేనని చెప్పుకొచ్చారు. గత ఏడు నెలలుగా పవన్ కళ్యాణ్ ను అదే భ్రమల్లో ఉంచగలిగారు చంద్రబాబు. కానీ టైం అవుతోంది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఏంటి? పవన్ కళ్యాణ్ ఏంటి అని టిడిపి నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ తో సమానంగా డిప్యూటీ సీఎం హోదా లోకేష్ కల్పించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అంతకుముందే ప్రధాని విశాఖ పర్యటనను దీనికి వినియోగించారు. ప్రధాని మోడీకి ఒకవైపు పవన్ కళ్యాణ్ ఉంటే.. మరోవైపు చంద్రబాబు చెంతనే లోకేష్ ఫోటోను పెట్టారు. తరువాత నేతలు ఒక్కొక్కరు మాట్లాడారు. అదే సమయంలో ఎల్లో మీడియా కథనాలు రాసింది. మరోవైపు బిజెపి నేతలను అదుపులోకి పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఇంత చేస్తే.. పవన్ కళ్యాణ్ ఒకే ఒక మంత్రదండంతో కట్టడి చేశారు. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తో ప్రత్యేక ప్రకటన చేయించారు. టిడిపి శ్రేణులకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్నట్టే.. లక్షలాదిమంది జనసైనికులు సైతం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ప్రకటన చేయించారు. అయితే ఇంతలోనే లోకేష్ కు అవసరమైన ప్రచారాన్ని కల్పించారు చంద్రబాబు. ఇదంతా తనకు తెలియకుండానే జరిగిందని చెప్పేందుకు.. ఇకనుంచి ఎవరూ మాట్లాడవద్దని ఒక ప్రత్యేక ప్రకటన చేసి ఫుల్ స్టాప్ పెట్టారు. వ్రతం చెడింది గాని.. దాని ఫలితం మాత్రం దక్కిందన్నట్టు ఉంది టిడిపి నేతలు వ్యవహార శైలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!