వైసీపీలో మరో రాజకీయ వారసుడు తెరపైకి వచ్చాడా? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నాడా? ఇంతకీ ఎవరా వారసుడు? ఏంటా కథ? తెలియాలంటే వాచింగ్ థిస్ స్టోరీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. జగన్కు అత్యంత వీర విధేయత కలిగిన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యేగా తన మార్క్ చూపించారు. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ప్రస్తుతం జగన్ వెంటే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు భాస్కర్ రెడ్డి. ఒకవైపు చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డి ఇన్చార్జిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇంకో వైపు చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు.
వాస్తవానికి చంద్రగిరి నుంచి తాను తప్పుకొని కుమారుడు మోహిత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోరారు. అందుకు జగన్ అంగీకరించారు కూడా. తాను మీ వెంట ఉంటూ సేవలందిస్తానని చెప్పడంతో జగన్ అంగీకారం తెలిపారు. దీంతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర పెరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఒంగోలు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో చెవిరెడ్డిని అక్కడకు పంపించారు జగన్. అక్కడ సెట్ రైట్ చేయాలని చూశారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా ప్రకటించారు. అధినేత మాట జవదాటకుండా అక్కడ పోటీ చేశారు భాస్కర్ రెడ్డి. కూటమి ప్రభంజనంలో ఓడిపోయారు. అయితే అక్కడ చెవిరెడ్డి కుటుంబం అయితే సరిపోతుందని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారట. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం తన కుమారుడు హర్షిత్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హర్షిత్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం లో అప్పుడే పర్యటనలు ప్రారంభించారు. స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడైన హర్షిత్ రెడ్డి… ఇప్పుడు వైసీపీ నేతృత్వంలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కు హర్షిత్ రెడ్డి పరిశీలకుడుగా వ్యవహరించారు. బీసీసీఐ ఆయనకు ఆ బాధ్యత అప్పగించింది. హర్షిత్ రెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకనుంచి వైసిపి కేంద్ర కార్యాలయంలో సేవలందిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో ప్రకాశం జిల్లా బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. క్షేత్రస్థాయిలో హర్షిత్ రెడ్డి ప్రకాశం జిల్లాలో అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి కుమారుడు సైతం అందుబాటులోకి వస్తారని.. ఆ ఇద్దరు యువనేతల ద్వారా ప్రకాశం జిల్లా రాజకీయ మంత్రాంగం నడపాలని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి అయితే వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒంగోలు ప్రాంతంలో.. పూర్వ వైభవం సాధించడానికి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటువైవి సుబ్బారెడ్డి తమ వారసుల ద్వారా భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇప్పటికే అక్కడ టిడిపి తో పాటు జనసేన బలంగా ఉన్నాయి. వైసీపీలో కీలక నేతగా ఉంటూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సైతం ఇక్కడ బలంగా ఉంది. ఆ రెండు పార్టీలను తట్టుకొని నిలబడాలంటే చెవిరెడ్డి తో పాటు వైవి సుబ్బారెడ్డి శక్తి యుక్తులను ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే అన్ని ఆలోచించి చెవిరెడ్డి వారసుడికి జగన్ జై కొట్టినట్లు సమాచారం. యువకుడు కావడంతో ప్రజల్లోకి బలంగా వెళ్తారని భావిస్తున్నార