Thursday, November 7, 2024

కాళ్లు మొక్కినొళ్లే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు – వెంకయ్య నాయుడు

- Advertisement -

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కాళ్లు మొక్కినొళ్లే ఆయనకు వెన్నుపోటు పోడిచారని చెప్పి పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచి కాలాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… సామాన్య కార్యకర్త నుంచి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఈ సమయంలో ఆయన బీజేపీ ఎంపీగా, పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఆయన ఎదిగారు. తరువాత పార్టీ ఆయన్ను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయడంతో.. ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. అయినప్పటికి కూడా తనదైనశైలిలో తాజా రాజకీయాలపై స్పందిస్తుంటారాయన.

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకే తాటి మీద ఉంటారనే విషయం పలు సందర్భాలు కనిపించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పని పోటీ చేయడం వెనుక వెంకయ్య నాయుడు పాత్ర ఉందని అంటుంటారు. తాజాగా ఆయన వెంకయ్య నాయుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచిన సందర్భాన్ని నెమరు వేసుకున్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్య నాయుడు కాళ్లపై మొక్కడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆయన తన పాత జ్జాపకాలను నెమరవేసుకున్నారు.

తాను ఓ రోజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లానని .. ఆ సమయంలో కొందరు ఆయనకు నమస్కరించారని..వారు మీకు ఎందుకు నమస్కరించారని తాను ఎన్టీఆర్ ను అడిగానని వెంకయ్య నాయుడు తెలిపారు. వారందరికి తాను అంటే ప్రేమ, గౌరవం అని అందుకే వారు నాకు నమస్కరించారని తనకు ఎన్టీఆర్ చెప్పారని వెంకయ్య నాయుడు చెప్పకొచ్చారు. దీనిపై నేను అభిమానమా…పిండాకూడా అంతా ఒట్టిదేనని తాను చెప్పానని.. ఆ సమయంలో ఎన్టీఆర్ నవ్వి ఊరుకున్నారని.. తీరా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో వారు దాని వెనుక ఉన్నారని వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వారు ఎవరో మాత్రం వెంకయ్య చెప్పలేదు. కాని వెంకయ్య నాయుడు చెప్పింది చంద్రబాబు గురించే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వెంకయ్య నాయుడు కామెంట్స్‌పై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!