Saturday, April 20, 2024

జగన్‌కు మోదీ గుడ్ న్యూస్..విశాఖకు లైన్ క్లియర్

- Advertisement -

జగన్ సీఎం అయిన నాటి నుంచి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో సత్ససంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులను స్నేహపూర్వంగా తీసుకొవచ్చని జగన్ ఆలోచన. కాని జగన్ ఇలా కేంద్రంతో స్నేహంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తట్టుకొలేకపోతున్నారు. ముఖ్యంగా జగన్ … ప్రధాని మోదీకి దగ్గర కావాడాన్ని ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం పక్కన పెట్టి జగన్‌కు ప్రధాని మోదీ పెద్ద పీట వేస్తున్నారు. ఏపీలో తన మిత్రుడు పవన్‌ను కాదని జగన్‌తో దోస్తీ కోసం పాకులాడుతున్నారు. ఇదే సమయంలో జగన్ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతుగా నిలిచారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలకు అండగా నిలిచారు.

ఎవరెన్ని విమర్శలు చేసిన తన పని తాను చేసుకుంటు ముందుకుపోతున్నారు జగన్. గతంలో పోలవరం నిధులపై కేంద్రం పెట్టిన మెలికలను త్వరగానే పరిష్కరం చేయించుకొగలిగారు జగన్. ఆ మధ్య ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లివచ్చారు ఏపీ సీఎం. ఈ పర్యటనలోప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి వీరితో చర్చించారు. ఏపీ ప్రభుత్వనికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో జగన్ చేస్తున్న సంస్కరణలను మెచ్చి ఏపీకి భారీ ప్యాకేజీని ప్రకటించింది మోదీ సర్కార్. తాజాగా మరోసారి జగన్ సర్కార్‌కు గుడ్ న్యూస్ అందించింది. ప్రధాని మోడీ ఈ నెల 11,12 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు.

ఈ టూర్ లో ప్రధాని చేత పలు ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయించేందుకు వైసీపీ సర్కార్ సిద్దమవుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇది నిజంగా జగన్ సర్కార్‌కు శుభవార్తే అని చెప్పాలి. భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణలో తలెత్తిన ఇబ్బందులు తొలగిపోవడంతో ప్రధాని మోడీ విశాఖ టూర్‌లో దీనికి శంఖుస్ధాపన చేయించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది.పర్యావరణ సమస్యలపై గతంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇదే సమయంలో జగన్ కూడా విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కూడా కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే మోదీ టూర్ తరువాత జగన్ విశాఖకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!