పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అలీ
నటుడు అలీ యాక్టివ్ పొలిటిక్స్‌లో దిగినట్లుగా కనిపిస్తున్నారు. ఇటీవలే ఆయనకు వైసీపీలో కీలక పదవిని కూడా అప్పగించారు. ఎలక్ట్రానిక్ మీడియా అడ్వాసైర్ పదవిని అలీకి అప్పగించింది వైసీపీ సర్కార్. గత ఎన్నికల ముందు అలీ వైసీపీ పార్టీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం అలీ చాలానే కృషి చేశారు.పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం కూడా నిర్వహించారు. అలీ తనకు పదవికి అప్పగించిన తరువాత తొలిసారి జగన్‌ను కలవడం జరిగింది. ఆయన భార్యతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. తన కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించే నిమిత్తం భార్యతో కలిసి వైఎస్ జగన్‌ను అలీ కలిశారు. అయితే ఈ సమయంలోనే తన మిత్రుడు ,జనసేన అధినేత అలీ గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ..జగన్‌ను కొందరు బూతులు తిడుతున్నారని,రాజకీయాల్లో సహనం అవసరం అన్నారు. సహనం ఉన్న వాళ్లు గొప్ప నాయకులు ఎదుగుతారని పవన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. రాజకీయాల్లో విమర్శలు కామన్ అని వాటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్తారని.. అంతేకాని విమర్శలను వ్యక్తిగతంగా తీసుకుంటే రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగలేరని అలీ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డం కరెక్ట్ కాదని అలీ స్పష్టం చేశారు. మనం ఏం మాట్లాడుతున్నామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరు కూడా జనాభా చూస్తుంటారని…అభ్యంతరకర భాష మాట్లాడ్డం సరైంది కాదని అలీ చెప్పుకొచ్చారు. ఇవ్వన్ని కూడా తన మిత్రుడైన పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి హితబోధ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై జనసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి.