సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైబడి సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ తమ కసరత్తును మొదలుపెట్టారు.. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తోన్నారు… అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది… దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని కొంతమంది భావిస్తున్నారు.. అందుకే అధికార పార్టీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు బాబు… ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఏపీలో… పనిలో పనిగా నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశాలు నిర్వహిస్తోన్నారు పవన్… అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పొత్తు నిజమా కాదా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే…