Wednesday, March 19, 2025

ఆ ఎమ్మెల్సీలు అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి?

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యూటర్న్ తీసుకున్నారా? తిరిగి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారా? అనవసరంగా రాజీనామా చేసామని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదించిన క్రమంలో తాము కూటమి పార్టీల్లో చేరడానికి డిసైడ్ అయ్యారు. అయితే వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. అలాగని అధికార పార్టీ వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వెనక్కి వచ్చేయడమే మేలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఓడిన తర్వాత చాలామంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు సైతం తమ పదవులను వదులుకున్నారు. ఎమ్మెల్సీ సైతం రాజీనామా చేసి పక్క పార్టీల్లో చేరారు. ఈ నేపథ్యంలో ఓ నలుగురు ఎమ్మెల్సీలు తమ పదవికి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరాలని భావించారు. కానీ వారి ప్రయత్నాలు ఇంతవరకు సక్సెస్ కాలేదు. దీంతో వారు పొలిటికల్ జంక్షన్ లో నిలబడాల్సి వచ్చింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం గుడ్ బై చెప్పారు. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజుకు ఫార్మేట్లో రాజీనామాలు చేశారు. కానీ ఆరు నెలలు పూర్తవుతున్న వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు.

మండలి చైర్మన్ మోసేన్ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇప్పటికీ శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. ఆపై మండలి చైర్మన్ మోసేన్ రాజు 2028 వరకు సభలోనే ఉంటారు. చైర్మన్గా కొనసాగుతారు. ఇది తెలియని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూటమి పార్టీలో చేరేందుకు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. వీరిని కూటమి పార్టీలు ఆహ్వానించడం లేదు.

పోనీ ఈ నలుగురు నేతలు ఏమైనా చరిష్మ ఉన్నవారు అంటే.. అదీ కాదు. వీరు వెళ్లడంతో ఆ పార్టీలు బలోపేతం అవుతాయి అనుకుంటే.. అంత సీన్ లేదని తెలుస్తోంది. అందుకే కూటమి పార్టీలు వీరిని పెద్దగా పట్టించుకోవడంలేదని ప్రచారం సాగుతోంది. వీరితో రాజీనామా చేయించిన టిడిపి నేతలు తర్వాత ముఖం చాటేశారు.

ఎమ్మెల్సీ పదవికి చాలా డిమాండ్ ఉంది. అటువంటిది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆ నలుగురు ఇష్టపడ్డారు. అయితే రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరితే.. ఉప ఎన్నిక అనివార్యం అవుతుందని.. అప్పుడు అదే ఎన్నికల్లో రాజీనామా చేసిన వారు నిలబడి గెలవాలన్నది ప్లాన్. ఈ వ్యూహంతోనే వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

అయితే కూటమి పార్టీలు పట్టించుకోకపోవడంతో వీరి రాజీనామాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. వీరి విషయంలో అసలు కూటమి ప్రభుత్వం కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. అందుకే ఈ ఎమ్మెల్సీలు అంతా మనసు మార్చుకున్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!