Tuesday, April 22, 2025

వైయస్సార్ కాంగ్రెస్ లో పదవుల సందడి.. కొత్త కార్యవర్గాలు.. జగన్ టార్గెట్ అదే!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్ధం అయ్యింది. ప్రజా పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నారు. అంతకంటే ముందే పార్టీని సమూల ప్రక్షాళన చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రం వరకు కార్యవర్గాల నియామకం పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎదురుకా లేదు. 2014 ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లతో గౌరవప్రదమైన స్థితిలో ఉండేది. అధికారంలో లేకపోయినా అధికార పార్టీకి ధీటుగా ఉండేది. ప్రజల్లోకి బలంగా వెళ్లి 2019లో అధికారానికి చేరువ అయింది.

అయితే 2014 లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు దిగజారి పోయింది. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ప్రత్యర్థులు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే దానిని అధిగమించాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏర్పడింది. అది జరగాలంటే పార్టీలో సమూల ప్రక్షాళన జరగాలి. సరికొత్త టీం తో ప్రజా పోరాటాలు మొదలుపెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తోంది అదే.

ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత అంత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఐదేళ్లపాటు పదవులు అనుభవించిన వారు సైతం సైడ్ అయిపోయారు. అవకాశం ఉన్నవారు కూటమి పార్టీలో చేరిపోయారు. లేనివారు మాత్రం తమకేందుకులే అన్నట్టు సైలెన్స్ పాటిస్తున్నారు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం బలంగా జనంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నాయకుల కంటే క్యాడర్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి.

ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో క్యాడర్ ముఖ్యం. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం క్యాడర్ పై దృష్టి పెట్టింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కార్యవర్గాలను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. పార్టీ పట్ల దూకుడుగా ఉన్న నేతలకు కార్యవర్గంలో చోటు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అన్ని జిల్లాల బాధ్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణం కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతుండడంతో వీలైనంత త్వరగా కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త నియామకాలు ప్రారంభం కానున్నయన్న మాట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!