Wednesday, March 19, 2025

అల్లు అర్జున్ పై ఏపీ మంత్రి సెటైర్.. మళ్లీ వివాదం రాజుకుంటుందా?

- Advertisement -

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఎన్నెన్నో వివాదాలకు కారణమైంది. విడుదలకు ముందు సంచలనాలు సృష్టించింది. విడుదల తర్వాత కూడా జరిగిన పరిణామాలు ప్రకంపనలు రేపాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ మరోసారి తట్టి లేపే లా ఉన్నారు. తెలుగు సినీ హీరోల గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో స్మగ్లర్లను హీరోలుగా చూపించడాన్ని ఆయన తప్పు పట్టారు. అది కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చేలా చేశారు సత్య కుమార్ యాదవ్. ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో ఇది అల్లు అర్జున్ కోసం చేసిన వ్యాఖ్యనంటూ ప్రచారం ప్రారంభం అయ్యింది.

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన ఆయన తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. పుష్ప చిత్రంతో విశేష ప్రజాదరణ పొందారు. దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. మరోవైపు కొద్దిరోజులుగా మెగా కుటుంబంతో గ్యాప్ మెయింటెన్ చేస్తూ వచ్చారు. అదే సమయంలో కొన్ని రకాల పరిణామాలు కూడా జరిగాయి. తనకు ప్రత్యేక ఆర్మీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మెగా అభిమానులతో సంబంధం లేదనే రీతిలో సంకేతాలు పంపారు. సరిగ్గా పుష్ప 2 చిత్రం విడుదల కు ముందు ఈ పరిణామాలన్నీ జరిగాయి. దీంతో అల్లు అర్జున్ సినిమాను అడ్డుకుంటామని మెగా అభిమానులు హెచ్చరించే దాకా పరిస్థితి వెళ్ళింది.

ఇంకోవైపు జనసేన ఎమ్మెల్యే ఒకరు అల్లు అర్జున్ వ్యవహర శైలిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే అల్లు అర్జున్ సినిమాను అడ్డుకుంటామన్న రీతిలో మాట్లాడారు. ఈ వివాదం ముదరడంతో నాగబాబు స్పందించాల్సి వచ్చింది. దీంతో జనసైనికులతో పాటు మెగా అభిమానులు సైలెంట్ అయ్యారు. అటు తరువాత హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్ కు అండగా నిలిచింది మెగా ఫ్యామిలీ. అక్కడ నుంచి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

అయితే ఇప్పుడు తాజాగా నంద్యాలలో మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వివాదాల్లో కూరుకు పోవడానికి అదే నంద్యాల కారణం. ఈ ఎన్నికల్లో నంద్యాల నుంచి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు తెలుపుతారు అంటూ జనసైనికులు ప్రశ్నించారు. అప్పటినుంచి అనేక వివాదాలు దాటుతూ.. ఒక కొలిక్కి వచ్చింది పరిస్థితి. అయితే ఇప్పుడు అదే నంద్యాలలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వివాదాన్ని తట్టి లేపే విధంగా స్మగ్లర్లను ఎలా హీరోలుగా చూపిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!