Sunday, March 16, 2025

విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చీట్

- Advertisement -

అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధన, నిబంధనలు ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చేశారు. పేరుకే సెకీ ఒప్పందం అదానితోనే.. జగన్ కు అదాని లంచం 1750 కోట్ల రూపాయలు… సెకి ఒప్పందంపై అభ్యంతరాలు తూచ్’.. ఎల్లో మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పై వచ్చిన కథనాలు ఇవి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు విషయంలో భారీ అవినీతి జరిగిందన్నది టిడిపి మీడియా చేసిన ఆరోపణ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా ప్రచారం చేశారు.సెకి తో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు అక్రమమని ఆరోపణలు చేశారు. కొద్దిరోజుల పాటు హడావిడి చేశారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చీట్ ఇచ్చింది. అప్పట్లో ఎలాంటి లోపాలు లేవని.. అంతా నిబంధనల మేరకే జరిగిందని.. అందుకే అప్పటి విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు రద్దు చేయడం లేదని తాజాగా స్పష్టం చేసింది. ఈ ఒప్పందం పై విషం చిమ్మారు చంద్రబాబు, టిడిపి అనుకూల మీడియా. కానీ అదంతా తప్పు అని తేలింది. జగన్మోహన్ రెడ్డికి ఇదే కూటమి ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చినట్లు అయింది.

రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూర దృష్టితో నాడు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కారు చౌకగా యూనిట్ రెండు రూపాయల 49 పైసలకే సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా లక్ష పదివేల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా అప్పటి జగన్ సర్కార్ అడుగులు వేసింది. అయితే ఈ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. జగన్మోహన్ రెడ్డికి అదాని 1750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని… పేరుకే సెకీ… ఒప్పందం అంతా ఆదానితోనేనని అప్పట్లో ప్రచారం చేసింది ఎల్లో మీడియా. జగన్మోహన్ రెడ్డి పై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే అదంతా తప్పని తాజాగా తేలిపోయింది.

వాస్తవానికి గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని చక్కదిద్దేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరించింది. వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందించింది. గత ఐదేళ్లలో రెండు లక్షలకు పైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా సెకి ఉంది. విద్యుత్ పంపిణీకి సంబంధించి త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది వైయస్సార్సీపి గవర్నమెంట్. ఇందులో ఎలాంటి రహస్యాలు కూడా లేవు. అప్పటి మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదంతో అత్యంత పారదర్శకంగా, బహిరంగంగా ఈ ప్రక్రియను చేపట్టారు.

కానీ అంతర్జాతీయంగా అదాని గ్రూపునకు సంబంధించి లోపాలు వెలుగు చూసాయి. అమెరికా కోర్టులో ఈ ప్రస్తావన వచ్చినట్లు కట్టుకథ అల్లింది ఎల్లో మీడియా. ఇండియాలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అదాని గ్రూపు అవినీతి వ్యవహారం నడిచిందని… అందులో జగన్ పేరు కూడా ప్రస్తావన వచ్చిందని ఎల్లో మీడియా పతాక శీర్షికలో అసత్య కథనాలను ప్రచురించింది. అయితే ఇప్పుడు సెకీ తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు సక్రమమైన అని విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించడంతో.. జగన్మోహన్ రెడ్డి పై అసత్య ప్రచారం తప్ప మరొకటి లేదని తేలిపోయింది #YSjagan

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!