Sunday, March 16, 2025

కొడాలి నాని లో అదే ధీమా.. కేసులు కృష్ణాజిల్లాకు అలవాటే!

- Advertisement -

మాజీ మంత్రి కొడాలి నాని తెగింపునకు వచ్చేసారా? తాడో పేడో అన్న నిర్ణయానికి వచ్చారా? తనపై కేసులు ఖాయమని నిశ్చయానికి వచ్చారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వారం రోజుల కిందట వరకు కొడాలి నాని ఎక్కడ? భయపడ్డారా? రాజకీయాలు వదిలేసారా? ఇక ఏపీకి రారా? అనే ప్రశ్నలు వినిపించాయి. మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ వారం రోజుల తరువాత సీన్ మారింది. కేసులు పెట్టుకోండి అంటూ ఆయన సౌండ్ చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 30 కేసులు పెట్టుకోండి ఐ డోంట్ కేర్ అంటున్నారు. మీరు ఒక అట్టు ఇస్తే.. మేము రెండు అట్లు ఇస్తాం. ఇంతకు ఇంత దెబ్బతీస్తాం. దీనికన్నా రెట్టింపు వడ్డిస్తాం అంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొడాలి నాని తన పాత స్టైల్ లోనే మాట్లాడుతున్నారు. బూతుల జోలికి వెళ్లలేదు కానీ.. కాస్త గట్టిగానే చురకలు అంటిస్తున్నారు. మేము ఎక్కడికి పోమ్.. ఇక్కడే ఉండి పోరాటం చేస్తామని తేల్చి చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చినా అనంతరం కొడాలి నాని ఎక్కడ కనిపించడం లేదు. కనీసం తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు కూడా చూడలేదు. సొంత నియోజకవర్గ గుడివాడకు సైతం దూరమయ్యారు. ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కూడా జరగడం లేదు. దీంతో కొడాలి నాని పని అయిపోయింది. ఆయన ఇక వైయస్సార్ కాంగ్రెస్ లో యాక్టివ్ కారు. రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. వంటి వార్తలు ప్రముఖంగా వినిపించాయి. కానీ అవన్నీ అవాస్తవం అని తేలిపోయింది.

కృష్ణాజిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్న నేతలకు అరెస్టుల బాధ తప్పదు. ఎందుకంటే ఆ జిల్లాల నేతలు రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉంటారు. అధినేతలకు దగ్గరగా ఉంటారు. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ కు చాలా మంది సన్నిహితులు ఉన్నారు ఆ జిల్లాలో. కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, పట్టాభి, బుద్ధ వెంకన్న, బోండా ఉమా వంటి నేతలంతా ఎంతో సన్నిహితులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వీరందరిపై కేసులు నమోదయ్యాయి. మానసికంగా వేధించారు. జైల్లో పెట్టారు. చాలా రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో వీరందరికీ పదవులు దక్కాయి. ఇప్పుడు కొడాలి నాని ధీమా కూడా అదే. అరెస్టులు చేస్తారు.. జైల్లో పెడతారు.. బెయిల్ వస్తుంది.. మా రాజకీయాలు మేము చేస్తాం.. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేస్తాం అని చెప్పుకొస్తున్నారు కొడాలి నాని. తద్వారా ఈ అరెస్టులు అనేవి సర్వసాధారణం అని కొట్టి పారేస్తున్నారు.

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ.. కొడాలి నాని కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. తనకు ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే ఆయన ఒక తెగింపునకు వచ్చేసారన్నమాట. మహా అయితే కేసులు తప్ప.. తమను ఎవరు ఏం చేయలేరని భావిస్తున్నారన్నమాట. కొడాలి నాని మాట తీరు చూశాక సగటు వైయస్సార్ కాంగ్రెస్ అభిమానుల్లో ఒక రకమైన ధైర్యం వచ్చిందట. పోరాడితే పోయేదేముంది కొద్దిరోజుల జైలు జీవితం తప్ప.. అన్నట్టు కొడాలి నాని వ్యవహార శైలి ఉంది. మొత్తానికి అయితే లేటుగా వచ్చిన.. లేటెస్ట్ గా వచ్చానంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కొడాలి నాని. ఆయనలో ఏమాత్రం ఫైర్ తగ్గలేదు. ఆ ఫైర్ ను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఫిదా అవుతున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!