Sunday, March 16, 2025

ఏపీ రాజకీయాల్లో షర్మిల తీరు వేరయా.. ఆమె విషయంలో కరెక్ట్ లైన్ లో వైసిపి!

- Advertisement -

నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్టు ఉంది వైయస్ షర్మిల పరిస్థితి. ఆమె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైనే ఏడుపు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరమై దాదాపు ఏడాది అవుతోంది. కానీ ఇంకా ఆయన అధికారంలోనే ఉన్నారు అన్నట్టు భావిస్తున్నారు షర్మిల. అందుకే అయిన దానికి కాని దానికి ఆయననే టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ఏం జరిగినా.. ఎలాంటి రాజకీయ పరిణామం చోటు చేసుకున్న.. దాని వెనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధం తగిలిస్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. తెల్లవారు మొదలు సాయంత్రం వరకు ఆడి పూసుకోవడమే ఆమె వంతు అన్నట్టు ఉంది. కాంగ్రెస్ ఏపీ చీఫ్ అనేకంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పై విమర్శలకే ఆమె నియామకం అన్నట్టు ఉంది పరిస్థితి.

ఆమె నిత్యం ట్విట్టర్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై తొలుత చిన్నపాటి విమర్శలు చేస్తారు. సరళమైన, సులువైన, గౌరవమైన భాష ప్రయోగం చేస్తారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తో పాటు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై మాత్రం పెద్ద పెద్ద పదప్రయోగాలు చేస్తారు. పందికొక్కులు, అవినీతి పరులు, కబ్జారాయుళ్లు అంటూ భారీ డైలాగులు చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీకి జగన్మోహన రెడ్డి దత్తపుత్రుడుగా కూడా అభివర్ణిస్తుంటారు. అయితే తాను చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. చంద్రబాబు తనను బాగా వాడుకోవడం లేదని.. తనను వాడుకుంటే ఇంకా బాగా ఉపయోగపడతానని స్వయంగా ఆమె చెప్పిన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ నేత వద్ద ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పినట్టు సదరు నాయకుడు చెప్పుకొచ్చాడు.

ఆమె ఇటీవల జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇస్తున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి పురాణం చెప్పే కంటే.. శాసనసభ సమావేశాలకు వెళ్ళవచ్చు కదా అని సూచిస్తున్నారు. అయితే శాసనసభ సమావేశాలకు వెళ్తే అక్కడ ఏ స్థాయి మర్యాద ఉంటుందో ఆమెకు తెలుసు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నేతలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అచ్చం నాయుడు రఘురామకృష్ణం రాజు స్పీకర్ పోస్టులో ఉండాలని.. తనకు గంట పాటు అవకాశం ఇవ్వాలని.. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరుకావాలని.. అప్పుడు నా ప్రతాపం చూపుతానంటూ ఆయన వ్యాఖ్యానించడం అందరూ చూశారు. జగన్మోహన రెడ్డి సభకు హాజరైతే అవమానం పడతారు అన్నది షర్మిలకు తెలుసు. అందుకే పదే పదే శాసనసభకు వెళ్లాలని ఆమె సూచిస్తున్నారు.

ఇటీవల వల్లభనేని వంశీ మోహన్ ను జైలులో జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. శాసనసభ సమావేశాలకు వెళ్లని వ్యక్తి.. నేరస్తులను జైల్లో కలిసేందుకు మాత్రం సమయం కేటాయిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు షర్మిల. కానీ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గౌరు వెంకటరెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఓ రాజకీయ నేతగా పరామర్శకు వెళ్లి ఉంటారు. అయితే దానిని కూడా తప్పుపడుతున్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి విషయంలో పురుషమైన పదజాలాలు వాడుతున్నారు. దమ్ము లేదా? అసమర్ధ నేత.. దోపిడీ దారుడు అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ విషయంలో గౌరవభావంతో మెలుగుతున్నారు. అందుకే షర్మిల లాంటి నేత విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. అది నిన్ననే బొత్స సత్యనారాయణ ద్వారా స్పష్టం అయింది. పని పాట లేని ఆమె మాటలు పట్టించుకోనవసరం లేదని బొత్స ప్రకటించారు. దీనిపై తెగ మండి పడిపోయారు షర్మిల. అయితే ఇన్నాళ్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ షర్మిల విషయంలో ప్రత్యేక లైన్లోకి వచ్చిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!