Wednesday, March 19, 2025

వైయస్సార్ కాంగ్రెస్ లోనే ధర్మాన.. ఎట్టకేలకు ఫుల్ క్లారిటీ!

- Advertisement -

ఆ సీనియర్ నేత పార్టీ మారాలని భావించారు. కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం పక్క చూపులు చూశారు. కానీ ఆశించిన స్థాయిలో సానుకూలత రాలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. దీంతో సొంత పార్టీలోనే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.

ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు. యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే మంత్రిగా ఎదిగారు ధర్మాన. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం సర్పంచ్ గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అటు తరువాత ఎంపీపీగా.. అటు కొద్ది కాలానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చిన్న వయసులోనే మంత్రి కూడా అయ్యారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం ఉన్న నేత. అందుకే వైయస్సార్ ప్రోత్సాహంతో 2004లో తన సొంత నియోజకవర్గ నరసన్నపేట ను విడిచిపెట్టారు. అక్కడ సోదరుడు కృష్ణ దాస్ పోటీ చేశారు. ధర్మాన ప్రసాదరావు 2004లో శ్రీకాకుళం నుంచి బరిలో దిగారు. ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజశేఖర్ రెడ్డి కీలక మంత్రిత్వ శాఖను కేటాయించారు. రెవెన్యూ శాఖను అప్పగించారు. అది మొదలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సైతం కొనసాగారు ధర్మాన.

జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ధర్మాన ప్రసాదరావు. కానీ కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో 2014 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యమిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు గెలిచారు. అయితే తన వెంట ముందుగా వచ్చిన ధర్మాన కృష్ణ దాస్ కు మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో మనస్థాపానికి గురైన ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కాలేదు. దీనిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి విస్తరణ సమయంలో కృష్ణదాస్ పదవిని తొలగించి ధర్మాన ప్రసాదరావుకు ఇచ్చారు.

అయితే 2024 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు దారుణంగా ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా బరిలో దిగగా.. ఆయన చేతిలో 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన. అప్పటినుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలోకి వెళ్లాలని భావించారు. అక్కడ కూడా నో ఎంట్రీ. తెలుగుదేశం పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. బిజెపి ఆహ్వానించిన కేడర్ లేదు. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న పాలకొండ పర్యటన కోసం శ్రీకాకుళం వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కలిశారు ధర్మాన, ఆయన కుమారుడు. పార్టీలో యాక్టివ్ అవుతామని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే బయటకు వెళ్లే మార్గం లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారు ధర్మాన ప్రసాదరావు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!