వైయస్సార్ కుటుంబం పుణ్యమా అని ఆయన పదవులు అందుకున్నారు. ఆ మహానేత ఆశీస్సులతో తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. కుమారుడు అవకాశం ఇవ్వడంతో రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. భారీగా సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ? తెలియాలంటే వాచ్ థిస్ స్టోరీ.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలియని వారు ఉండరు ఏపీలో. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు పిలిచి మరి టిక్కెట్ ఇవ్వడంతో గెలిచారు. రెండోసారి గెలిచిన ఆయనకు రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పిలుపుతో మంత్రి పదవి కూడా త్యాగం చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన త్యాగానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2019లో గెలవడంతో ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మూడేళ్ల పాటు మంత్రిగా వెలగబెట్టారు బాలినేని. భారీగా పోగేసుకున్నారు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి.
అయితే రాష్ట్రస్థాయిలో మంత్రివర్గ విస్తరణలో అందరితో పాటు పదవి కోల్పోయారు బాలినేని. అయితే తాను అందరిలో ఒకడిని కాదని.. తనను మార్చవద్దని జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు బాలినేని. అయితే సమీకరణలో భాగంగా మంత్రి పదవి నుంచి తొలగించారు జగన్మోహన్ రెడ్డి. అది మొదలు అసంతృప్తి చెందిన బాలినేని ఈ ఎన్నికల ఫలితాల్లో ఓడిపోయారు. జనసేనలోకి వెళ్లిపోయారు.
అయితే తాజాగా జనసేన ఆవిర్భావ సభలో బాలినేని వ్యవహరించిన తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బాలినేని. తండ్రి మరణంతో ముఖ్యమంత్రి పదవి ఆశించారని తప్పుపట్టారు బాలినేని. మరినాడు జగన్మోహన్ రెడ్డిని అనుసరించిన నాయకుల్లో బాలినేని ఒకరు. అప్పుడు తెలీదా అంటూ సెటైర్లు పడుతున్నాయి.
కేవలం అవినీతిగా సంపాదించుకున్న సొమ్ము పోతుందని.. కేసులు మెడకు చుట్టుకుంటాయన్న ఆందోళనతోనే బాలినేని జనసేనలో చేరారు అన్నది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. కానీ బాలినేని తీరు చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం రాజకీయ ఊసరవెల్లిలా మారిన బాలినేని తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గట్టిగానే బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. తన పొలిటికల్ కెరీర్ కోసం.. తనకు ఇంతటి భవిష్యత్తు ఇచ్చిన కుటుంబం పై విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.