Tuesday, April 22, 2025

పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్.. తెరపైకి మరో వివాదం

- Advertisement -

మరోసారి పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్న పరిస్థితి వచ్చింది. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు ప్రకాష్ రాజ్. తాజాగా పవన్ చేసిన కామెంట్స్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారింది.

పిఠాపురం వేదికగా జనసేన ప్లీనరీ జరిగిన సంగతి తెలిసిందే. అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. మరోసారి మతాల ప్రస్తావన తీసుకొచ్చారు. దేశ విచ్చిన్నానికి కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందూ మత రక్షణ గురించి మాట్లాడారు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తమిళనాడులో హిందీ కి వ్యతిరేకంగా జరుగుతున్న విభాగాన్ని ప్రస్తావించారు. హిందీ తో పాటు సంస్కృతాన్ని అక్కడ నిషేధించే ప్రయత్నాల గురించి మాట్లాడారు పవన్. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే జాతీయ భాషలపై కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారని.. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారని తమిళ నేతలు వ్యాఖ్యానించడానికి తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. అటువంటిప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయవద్దని సూచించారు పవన్. మీకు డబ్బులు కావాలంటే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు కావాలా? కానీ హిందీ మాత్రం వద్దా అంటూ పిఠాపురం సభలో మాట్లాడారు పవన్ కళ్యాణ్.

అయితే దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన బహుభాషా విధానం పై కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని చెప్పుకొచ్చారు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని.. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.

అయితే పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ వివాదం ఈనాటిది కాదు. తిరుమల లడ్డు వివాద సమయంలో పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ప్రజల్లో అయోమయం సృష్టించవద్దని.. అధికారంలో ఉన్నది మీరే కదా.. నిగ్గు తేల్చండి అంటూ పవన్ కళ్యాణ్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. అప్పటినుంచి వివాదం ప్రారంభం అయింది.

సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థ అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనవంతు కృషి చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. దీనిని కూడా తప్పుపట్టారు ప్రకాష్ రాజ్. బిజెపి అజెండా అమలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే పవన్ జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రతి చర్య పై గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు తమిళనాడులో హిందీ భాష నియంత్రణపై పవన్ కళ్యాణ్ మాట్లాడగా.. దానికి అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు ప్రకాష్ రాజ్. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!