Tuesday, April 22, 2025

జనసేన ప్లీనరీతో తగ్గిన పవన్ ఇమేజ్

- Advertisement -

జనసేన ప్లీనరీ ఆ పార్టీ ఇమేజ్ పెంచిందా? తగ్గించిందా? అంటే మాత్రం ముమ్మాటికి తగ్గించిందనే సమాధానం వినిపిస్తోంది. జనసేన ప్లీనరీపై భారీగా అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసేలా ప్రసంగాలు సాగాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగం పై భారీ అంచనాలు కొనసాగాయి. కీలక ప్రసంగం చేస్తారని.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అంతా భావించారు. కానీ పవన్ ప్రసంగం తుస్సుమనిపించింది.

మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. కూటమి భవిష్యత్ పై నీలి నీడలో కమ్మేలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చురకలు అంటించేలా ఉన్నాయి. మున్ముందు పరిస్థితి ఇలా ఉండదని.. జనసేన నిర్ణయాలు సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని మెగా బ్రదర్స్ గట్టిగానే సంకేతాలు పంపారు.

లక్షలాదిమంది తరలివచ్చే జనసేన ప్లీనరీలో భారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎవరు ఊహించని.. ఊహించలేని నేతలు సైతం జనసేనలోకి క్యూ కడతారని ఆ పార్టీ లీకులు ఇచ్చింది. పలువురు తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేనలోకి వస్తారని కూడా అనుకూల మీడియా రాసుకు వచ్చింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు ఆ పార్టీలో.

ప్రధానంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు, మాజీ ఎంపీ వంగా గీత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు, విశాఖ జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, రాయలసీమ నేతలు.. ఇలా ఒక్కరేమిటి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా జనసేనలో చేరుతారని ప్రచారం హోరెత్తించారు. కానీ అది వాస్తవం కాదని తేలిపోయింది.

అయితే భవిష్యత్తు రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తారని లక్షలాదిమంది జనసైనికులు ఎదురు చూశారు. కానీ సాధారణ ప్రసంగం గానే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కేవలం తెలుగుదేశం పార్టీకి చురకలు అంటించేందుకే కార్యక్రమం ఏర్పాటు చేశారా? అది భావించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏదో అనుకుంటే ఏదో అయింది అని జనసైనికులు సైతం నిరాశ వ్యక్తం చేయడం విశేషం.

పిఠాపురంలో జనసేన ప్లీనరీ ప్లాన్ చేసేసరికి రకరకాల అంచనాలు కొనసాగాయి. జన సమీకరణ లేదంటూనే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జన సమీకరణ చేసింది. అందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే జనాన్ని తరలించిన జనసేన వారిని సంతృప్తి పరచలేకపోయింది. అయితే అప్పటివరకు టిడిపి శ్రేణుల్లో పవన్ పై ఉన్న ఆరాధన భావన ప్లీనరీతో అమాంతం తగ్గిపోయింది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!