రాయలసీమ విషయంలో జగన్మోహన్ రెడ్డి భారీ ప్లాన్ తో ఉన్నారా? రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతరులను చేరదీసే పనిలో పడ్డారా? ముఖ్యంగా బలిజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారా? అందుకు బ్రహ్మాస్త్రం ఉపయోగించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం దూరమయింది అని చెప్పలేం కానీ.. ఎన్నికల్లో మాత్రం పూర్తిస్థాయిలో పనిచేయలేదు ఆ సామాజిక వర్గం. దాని ఫలితంగానే రాయలసీమలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఫలితాలు వచ్చాయి. ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే క్రమంలో సొంత సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమిలో రెడ్డి సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం తగ్గడం లేదు. దీంతో వారిలో సైతం ఆలోచన ప్రారంభం అయింది. వచ్చే ఎన్నికల నాటికి రెడ్డి సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడం ఖాయంగా తేలిపోయింది. అయితే మరో కీలక సామాజిక వర్గమైన బలిజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఆ బాధ్యతను గంటా నరహరి కి అప్పగించారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత.
—===== అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలిజనేతగా గంట నరహరిని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు నరహరి. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ నేత ఓ వెలుగు వెలిగారు. రాయలసీమలో బలిజల పరంగా గట్టి ప్రభావితం చేశారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉండగా ఆ పార్టీలో చేరారు. భారీగా ఖర్చు పెట్టారు. కానీ పొత్తులో భాగంగా ఆశించిన సీటు దక్కకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం ఎదురు కావడంతో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాస్యంలోకి వెళ్లాయి. కానీ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన మహానాడుతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది కార్యకర్తలు తరలి రావడంతో కొత్త ఊపు వచ్చింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు గంటా నరహరి. స్వతహాగా ఆర్థిక శ్రీమంతుడు కావడంతో మదనపల్లె ప్రాంతంలో మినీ మహానాడు ఏర్పాటు చేశారు. లక్షలాది మందితో బలప్రదర్శనకు దిగారు. దాంతో రాష్ట్రస్థాయిలో ఒక గుర్తింపు సాధించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం దృష్టిలో కూడా పడ్డారు. చంద్రబాబుతో పాటు లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడంటే అప్పుడు నేరుగా కలుసుకునే చనువు తీసుకునేవారు. కానీ 2024 ఎన్నికలకు ముందు నరహరి ఆశించిన సీటు దక్కకపోవడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు గంటా నరహరి. బలిజ సామాజిక వర్గంలో తనకంటూ ఒక గుర్తింపు ఉంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రస్థాయిలో ఓ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాయలసీమలో బలిజ సామాజిక వర్గం కూటమి వైపు ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. గంటా నరహరి సైతం వైసీపీలో క్రియాశీలకం అవుతున్నారు. అది కలిసి వచ్చే అంశం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.