జగన్మోహన్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. తనలో ఎంత మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపిస్తున్నారు. జనం కోసం ఎంత దాకా అయినా వెళ్తానని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల బాట పడుతున్నారు. ప్రజలు కూడా జననీరాజనం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తున్నా జనం సునామీల తరలివస్తున్నారు. అదే సమయంలో జగన్ వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైయస్ జగన్మోహన్ రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్న లేకున్నా ఏ రకంగా చూసిన ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలు ఆయన చలించిపోతారు. జనాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. గత కొద్దిరోజులుగా ఆయనను చూస్తుంటే మునుపటి దూకుడు కనిపిస్తోంది.
ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానం. ప్రజల విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా సాయం అందాలన్నది ఆయన అభిమతం. రాష్ట్రంలో మిర్చి రైతులకు న్యాయం చేయాలని ఆయన నినదించారు. స్వయంగా గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యలపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి విన్నవించారు. అంతటితో ఆగకుండా రైతుల సమస్యలపై సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ ట్వీట్ వైరల్ అయింది. దేశ రాజధానికి తాకింది. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిర్చి రైతుల సమస్యలను జాతి దృష్టికి తీసుకు రాగలిగారు.
9 నెలల కిందట దారుణ పరాజయం. ఊహించని అపజయం. కానీ దానిని అధిగమించి జనాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే జనం నీరాజనాలు పలుకుతున్నారు. పది సంవత్సరాల వయసు లేని పిల్లలు సైతం జగన్మోహన్ రెడ్డి కోసం ఆరాటపడుతున్నారు. అంతలా అభిమానం చూపుతున్నారు. జనం ఇబ్బందుల్లో ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లాలి. వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకోవాలి. తమ బాధ్యతగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. అవసరం అయితే నేనున్నాను అంటూ బాధితులకు ఓదార్చాలి. అంతేకానీ తాను వెళితే ఇబ్బందులు తలెత్తుతాయని తప్పించుకునేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. అధికారంతో ఆయనకు సంబంధం లేదు. అది ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా నటించడం ఆయనకు చేతకాదు. గత ఐదేళ్లలో సంక్షేమంతో పేదల ముఖాల్లో సంతోషం నింపారు. అప్పుడు ఇప్పుడు సమస్య ఎక్కడ ఉన్న నేనున్నాను అంటూ అడుగు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.
ప్రస్తుతం జగన్ జనం బాట పట్టారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటుంది. పండు ముసలి నుంచి ఊహ తెలిసిన పిల్లాడిదాకా.. అందరూ జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనను దగ్గరగా చూడాలని.. వీలైతే ఆయనను కలవాలని.. తమ ఫోన్లలో క్లిక్ మనిపించాలని ఆరాటపడుతున్నారు. రాజకీయాల్లో అవసరాలకు తగ్గట్టు మసులుకోవడం జగన్మోహన్ రెడ్డి శైలి కాదు. జనాలకు దూరంగా ఉండడం ఆయనకు చేతకాదు. ఆయన వస్తున్నారంటేనే జనం ఆటోమేటిక్ గా తరలివస్తున్నారు. అది ఏ సందర్భం అయినా సరే.. జనం మాత్రం తిరుగులేని ఆదరణ కనబరుస్తున్నారు. అదే సమయంలో జగన్ చేస్తున్న ప్రకటనలకు ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతోంది. మళ్లీ తమకు అపజయం తప్పదని భావిస్తున్న వారు ఉన్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి దూకుడు తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంటోంది.