పవర్ లో ఉంటే అన్ని కొట్టుకుపోతాయి. పవర్ చేయి జారిన తర్వాతే అసలు విషయాలు బయట పడతాయి. వైఫల్యాలు గుర్తుకొస్తాయి. ఎన్నెన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే మాదిరిగా గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. తన హయాంలో జరిగిన తప్పిదాలను గుర్తు చేసుకుంటున్నారు. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగుతున్నారు. వ్యూహాలను సైతం మార్చుకుంటున్నారు. శత్రువులను ఎలా నిర్వీర్యం చేయాలో నేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జోలికి ఆయన వెళ్లడం లేదు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. ఆయన వైవాహిక జీవితం పై మాట్లాడడం లేదు. అదంతా వ్యూహాత్మకమైన అని తెలుస్తోంది. ఎన్నికల్లో అంత ఘోర ఓటమికి కారణాలేంటని విశ్లేషించుకున్న టైంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ప్రధానంగా వచ్చింది. ఆయన వ్యక్తిగత జీవితం పై మాట్లాడడం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందన్నది సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపించిందట. పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా అటాక్ చేయడం వల్ల కాపులు తమకు దూరమయ్యారని భావిస్తున్నారట వైసీపీ నేతలు. సేనానిని విమర్శించడం వల్ల యూత్ ఓట్లు కూడా తమకు పోలరైజ్ కాలేదని అనుకుంటున్నారట. అయితే సొంత పార్టీ నేతల సూచనలో.. లేకుంటే వచ్చిన నివేదికలో తెలియలేదు కానీ.. వైసిపి అధినేత వాస్తవాలను గమనించినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి జనం బాట పట్టారు. జనంలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కానీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ జోలికి మాత్రం వెళ్ళలేదు. దీంతో జగన్లో మార్పు స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ లక్ష్యంగా మాటల తూటాలు పీల్చేవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. జగన్ తో సహా ఆయన అనుచర నేతలు గట్టిగానే అటాచ్ చేసేవారు. పవన్ కళ్యాణ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని.. చంద్రబాబుకు దత్త పుత్రుడు అంటూ విమర్శలు చేసేవారు. అలా పవన్ పై అటాచ్ చేస్తే ఆయన పలుచన అవుతాడని.. అచేతనం అయిపోతాడని భావించేవారు వైయస్సార్ కాంగ్రెస్ లీడర్లు. అందుకే ఎక్కడకు వెళ్లిన పర్సనల్ అటాక్ చేసేవారు. చివరికి జగన్మోహన్ రెడ్డి సైతం అదే వరవడిని కొనసాగించేవారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం దీనిపై నివేదికలు వచ్చాయి. పవన్ పై ఎక్కుపెట్టిన బాణాలు మిస్ ఫైర్ అయ్యాయని అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారట. అందుకే కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలు తగ్గించి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నే టార్గెట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఆ కారణంగానే జగన్ తన స్వరాన్ని సవరించారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు పవన్, చంద్రబాబును విడదీసి పాలిటిక్స్ ప్లే చేయాలనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి. కానీ వారిద్దరి మధ్య బంధం పెరుగుతోంది. ఎన్నికల తరువాత పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయినప్పుడు వారు కూడా ఇదే విషయం చెప్పారట. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లడం వల్లే డ్యామేజ్ జరిగిందని చెప్పుకొచ్చారట. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ జోలికి వెళ్లకుండా.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారట.