Tuesday, April 22, 2025

పిఠాపురం వర్మకు జగన్ బంపర్ ఆఫర్

- Advertisement -

పిఠాపురం వర్మకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ప్రకటించిందా? పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందా? పిఠాపురం బాధ్యతలు ఆఫర్ చేసిందా? వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వర్మ సైతం టిడిపిలో ఉంటే ఎమ్మెల్సీ తప్ప మరో పదవి రాదని తేలిపోయింది. పిఠాపురం నియోజకవర్గం పై ఆశలు వదులుకోవాల్సిందేనని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రతి నేతకు ఒక నియోజకవర్గం అంటూ ఉంటుంది. అలానే వర్మకు పిఠాపురం. ఇండిపెండెంట్గా గెలిచిన సామర్థ్యం ఆయనది. అంతలా ఉంది అక్కడ ఆయన చరిస్మా. అటువంటి చోట పవన్ గెలిచారు వర్మ సాయంతో. కానీ వర్మ ప్రమేయం లేకుండా పవన్ గెలిచారని నాగబాబు చెబుతున్నారు. అంటే వర్మ అవసరం లేదన్నట్టే కదా. వర్మ తనకంటూ తాను ప్రూవ్ చేసుకోవాలనే కదా. అందుకే ఇప్పుడు వర్మ తీవ్ర ఆలోచనలో పడ్డారు. తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.

పిఠాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం, వంగ గీత.. లాంటి నేతలు ఉన్న వర్మ కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ వారికి లేదు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి వర్మ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తక్షణం నియోజకవర్గ బాధ్యతలు.. 2029లో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పినట్లు సమాచారం.

మరోవైపు 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై వర్మ ఓడిపోయిన సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబులా కాదని.. తాను మాట ఇస్తే చేసి తీరుతానని.. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది.

వర్మ అనుచరుల సైతం ఎన్నాళ్లు ఈ అవమానాలు అంటూ బాధపడుతున్నట్లు సమాచారం. వెయిట్ చేస్తే వచ్చేది ఎమ్మెల్సీ పదవి మాత్రమేనని.. ఎట్టి పరిస్థితుల్లో నాటి గౌరవం ఉండదని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే గౌరవం పెంచుకోవచ్చని.. నాయకత్వాన్ని మరింత పెంచుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ను స్వీకరించాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!