Tuesday, April 22, 2025

జమిలి ఖాయం.. ఏపీలో ముందస్తు ఎన్నికలు

- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధపడుతుందా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జమిలి ఎన్నికల మాట ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజాగా బిజెపి ఎమ్మెల్యే ఒకరు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని తేల్చేశారు. జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్దపడుతుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి అని కూడా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇదో హాట్ టాపిక్ అవుతోంది.

బిజెపి ఈసారి ఏపీలో బోణి కొట్టింది. తెలుగుదేశం, జనసేనతో పొత్తులో భాగంగా 8 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తోంది బిజెపి. ఇటువంటి తరుణంలో బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవని ప్రకటించారు. దీంతో మరోసారి ముందస్తు ఎన్నికలపై బలమైన చర్చ ప్రారంభం అయ్యింది.

గత కొంఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధపడుతుందా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జమిలి ఎన్నికల మాట ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజాగా బిజెపి ఎమ్మెల్యే ఒకరు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని తేల్చేశారు. జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్దపడుతుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి అని కూడా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇదో హాట్ టాపిక్ అవుతోంది.

బిజెపి ఈసారి ఏపీలో బోణి కొట్టింది. తెలుగుదేశం, జనసేనతో పొత్తులో భాగంగా 8 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తోంది బిజెపి. ఇటువంటి తరుణంలో బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవని ప్రకటించారు. దీంతో మరోసారి ముందస్తు ఎన్నికలపై బలమైన చర్చ ప్రారంభం అయ్యింది.

గత కొంతకాలంగా జమిలి ఎన్నికల మాట వినిపిస్తూనే ఉంది. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాదు కాదు 2034 నాటికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని మరోవైపు టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక రకమైన కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొంది. కానీ పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం వంటి దూకుడు చూస్తుంటే.. నెక్స్ట్ టార్గెట్ జమిలి ఎన్నికల బిల్లు అంటూ తెగ ప్రచారం నడుస్తోంది.

అయితే ముందస్తు ఎన్నికలు వస్తే కూటమికి దెబ్బ పడటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చారు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు పథకాలు కార్యరూపం దాల్చలేదు. ప్రజల్లో అసంతృప్తి కూడా ప్రారంభం అయింది.

పాలనాపరంగా చంద్రబాబు తన ముద్ర చూపలేకపోతున్నారు. సంకీర్ణ కూటమి కావడంతో ఓ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపిల మధ్య సమన్వయం లోపిస్తోంది. పొత్తు అనేది కేవలం పై స్థాయిలో మాత్రమే అన్నట్టు పరిస్థితి ఉంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల టిడిపి నేతలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధైర్యం కూడ తీసుకొని పోరాటబాట పట్టింది. మండల పరిషత్ ఉప ఎన్నికల్లో తన బలాన్ని నిలబెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ పట్టు తగ్గలేదని నిరూపించుకుంది. అటు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం యాక్టివ్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జమిలీలో భాగంగా ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అంశం అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాదు కాదు 2034 నాటికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని మరోవైపు టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక రకమైన కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొంది. కానీ పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం వంటి దూకుడు చూస్తుంటే.. నెక్స్ట్ టార్గెట్ జమిలి ఎన్నికల బిల్లు అంటూ తెగ ప్రచారం నడుస్తోంది.

అయితే ముందస్తు ఎన్నికలు వస్తే కూటమికి దెబ్బ పడటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చారు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు పథకాలు కార్యరూపం దాల్చలేదు. ప్రజల్లో అసంతృప్తి కూడా ప్రారంభం అయింది.

పాలనాపరంగా చంద్రబాబు తన ముద్ర చూపలేకపోతున్నారు. సంకీర్ణ కూటమి కావడంతో ఓ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపిల మధ్య సమన్వయం లోపిస్తోంది. పొత్తు అనేది కేవలం పై స్థాయిలో మాత్రమే అన్నట్టు పరిస్థితి ఉంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల టిడిపి నేతలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధైర్యం కూడ తీసుకొని పోరాటబాట పట్టింది. మండల పరిషత్ ఉప ఎన్నికల్లో తన బలాన్ని నిలబెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ పట్టు తగ్గలేదని నిరూపించుకుంది. అటు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం యాక్టివ్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జమిలీలో భాగంగా ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అంశం అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!