మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వొద్దన్న డిమాండ్ పెరుగుతోంది. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవే ఎక్కువ అని.. మంత్రి పదవి ఎలా ఇస్తానని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. సినీ రంగంలో చిరంజీవికి వ్యతిరేకులు పెరగడానికి కారణం నాగబాబు అని.. ఇప్పుడు రాజకీయంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ కు సైతం నాగబాబు అడ్డంగా నిలుస్తారని ఎక్కువమంది అనుమానిస్తున్నారు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న నాగబాబుకు అండగా నిలిచింది మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని గుర్తు చేస్తున్నారు.
నాగబాబుది విలక్షణ శైలి. ఆయన తీరు సపరేట్ గా ఉంటుంది. చాలా దూకుడు స్వభావం. అంతకుమించి అహంకారి. సినీ రంగంలో చిరంజీవికి ఎక్కువ శత్రువులు పెరగడానికి నాగబాబు తీరే కారణం. కేవలం మెగాస్టార్ స్టార్ డంను చూసుకుని నాగబాబు ఎదుట వ్యక్తులకు గౌరవం ఇవ్వరు. ఇది చాలా సందర్భాల్లో స్పష్టమైంది కూడా. యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ఒక రచ్చ ఇతను వాడు వీడు అంటూ సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. ఆయనే కాదు సినీ రంగంలో చాలామంది పై నోరు పారేసుకున్నారు నాగబాబు.
సినీ రంగంలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే లేనిపోని వివాదాల్లో తలదూర్చి ఆ కుటుంబాన్ని నాగబాబు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం.. ఆగ్రహంతో స్టేట్మెంట్లు ఇవ్వడం నాగబాబుకు అలవాటైన విద్య. సినీ రంగంలో నిర్మాతగా చేతులు కాల్చుకున్నారు. ఆ సమయంలో మెగా బ్రదర్స్ ఇద్దరు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు పొలిటికల్ గా కూడా నాగబాబు ఇబ్బందులు తెచ్చి పెడతారన్న అనుమానాలు ఉన్నాయి.
ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే కూటమిలో చీలికలు తెచ్చే సంకేతాలులా ఉన్నాయి. ముఖ్యంగా టిడిపి శ్రేణులకు నాగబాబు మాటలు రుచించలేదు. చాలామంది జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అనవసరంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని.. ఆయనతో కూటమికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
అసలు పిఠాపురం సభలో వర్మను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వరకు వర్మ సాయం లేనిదే అడుగు ముందుకు పడలేదని.. ఇప్పుడు గెలిచాక ఆ విజయం ఎవరిది కాదని నాగబాబు వ్యాఖ్యానించడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది ముమ్మాటికి నాగబాబు చేసిన తప్పిదమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. నాగబాబు లాంటి వ్యక్తి మంత్రివర్గంలోకి వస్తే వివాదాస్పద కామెంట్స్ చేస్తారని.. కూటమిని ఇరుకున పెడతారని అనుమానాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆపై వివాదాస్పద నేత. మంత్రిగా మారకముందే పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ బాగాలేదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనుమతి లేనిదే నాగబాబు కామెంట్స్ చేయరు. అందుకే ముందు నాగబాబు వల్ల చాలా రకాల పరిణామాలు జరగబోతున్నాయి అన్న అనుమానాలు ఉన్నాయి. నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవడం విషయంలో చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి.