Sunday, March 16, 2025

రెడ్ బుక్ లో నెక్స్ట్ గోరంట్ల మాధవ్!

- Advertisement -

రెడ్ బుక్ లో నెక్స్ట్ పేరు ఎవరిది? వల్లభనేని వంశీ అయ్యారు. పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. ఇక తర్వాత ఎవరు అంటే మాత్రం వినిపిస్తున్న పేరు గోరంట్ల మాధవ్. హిందూపురం మాజీ ఎంపీ ఆయన. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలా దూకుడుగా ఉండేవారు. అటువంటి నేతపై ఇప్పుడు పాత కేసును తిరగదోడారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.

గతంలో హిందూపురంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే బాధితురాలు పేరును ఒక ఇంటర్వ్యూలో గోరంట్ల మాధవ్ చెప్పారంటూ నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని విజయవాడ పోలీసులు పేర్కొన్నారు. అయితే అప్పట్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతోనే గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు అందించడం విశేషం. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా పని చేశారు గోరంట్ల మాధవ్. అప్పట్లో అదే పార్టీకి చెందిన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉండేవారు. అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే టిడిపిలో మహిళా నేతల అభ్యంతరాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు అదే వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ పై నేరుగా ఫిర్యాదు చేయడం విశేషం. టిడిపి హై కమాండ్ సూచనతోనే ఆమె ఫిర్యాదు చేసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది.

మార్చి ఐదున గోరంట్ల మాధవ్ విచారణకు హాజరుకావాలని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. నోటీసుల్లో స్పష్టం చేశారు. విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడం పై మాజీ ఎంపీ మాధవ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో త్వరలో అంతర్యుద్ధం రానుంది అన్నారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్టు చేసుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. తాను అత్యాచార బాధితుల తరఫున మాట్లాడాలని చెప్పుకొచ్చారు మాధవ్.

అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న జెసి దివాకర్ రెడ్డి పై తిరుగుబాటు చేశారు గోరంట్ల మాధవ్. అప్పట్లో పోలీస్ శాఖలో సీఐ హోదాలో ఉండే మాధవ్ ఏకంగా దివాకర్ రెడ్డి పై సవాల్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆ దూకుడును చూసిన జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హిందూపురం టికెట్ ఇచ్చారు. ఎంపీగా గెలిచిన మాధవ్ కొన్ని రకాల వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే ఇప్పుడు ఓ అత్యాచార బాధితురాలు పేరు వెల్లడించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో బాధిత కుటుంబాన్ని ఆదుకునే స్థాయిలో ఉన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆ పని చేయలేదు. కానీ ఇప్పుడు రాజకీయ ప్రాపకం కోసం గోరంట్ల మాధవ్ పై కేసు పెట్టినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే రెడ్ బుక్ లో నెక్స్ట్ పేరు గోరంట్ల మాధవ్ గా వినిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!