Sunday, March 16, 2025

టిడిపికి పవన్ షాక్.. ఇక మంత్రిగా నాగబాబు!

- Advertisement -

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. కీలక భాగస్వామిగా జనసేన ఉంది. మరో జాతీయ పార్టీ బిజెపి మద్దతు కూడా ఉంది. అయితే మూడు పార్టీల మధ్య పొత్తు మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని అధినేతలు చెబుతూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. పై స్థాయిలో కూడా నోటి మాట వరకే అన్నట్టు ఉంది. లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. నాగబాబు ఎపిసోడ్ దానికి ప్రధాన కారణం. నాగబాబు కు పదవి విషయంలో టిడిపి అనుకూల మీడియా చేసిన హడావిడి అంతా కాదు. జనసేన శ్రేణుల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించాయి. దానికి చెక్ చెప్పారు పవన్ కళ్యాణ్.

జనసేనలో నాగబాబు ది యాక్టివ్ రోల్. మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచింది ఆయనే. ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా నాగబాబు అంతలా పని చేయలేదు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. అయితే గత ఐదేళ్లుగా జనసేన అభివృద్ధికి పాటుపడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండగా జనసేన పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దేవారు.

2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెట్టాలన్నది నాగబాబు వ్యూహం. అందుకు అనకాపల్లి ఎంపీ స్థానంపై ఆయన దృష్టి పెట్టారు. అక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఇంతలో ఆ స్థానం బిజెపికి వెళ్లడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జనసేన తో పాటు కూటమి తరుపున ప్రచారం చేయాల్సి వచ్చింది. అయితే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది. కానీ 9 నెలల్లో ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తొలుత టీటీడీ చైర్మన్ పోస్టు నాగబాబుకు ఇస్తారని ప్రచారం నడిచింది. తరువాత ఆయనకు రాజ్యసభకు వెళ్లాలని ఉందని టాక్ నడిచింది. ఈ క్రమంలో మొన్న ఆ మధ్య మూడు రాజ్యసభ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఆ మూడు రాజ్యసభ సీట్లు టిడిపి కూటమి ఖాతాలో పడ్డాయి. నాగబాబు పేరు చివరి వరకు వినిపించినా.. సమీకరణలు మారడంతో ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో సీఎం చంద్రబాబు స్పందించి నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అయితే ఇక్కడే టిడిపి వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. నాగబాబు పదవి విషయంలో ఎల్లో మీడియా రకరకాల ప్రచారం చేసింది. వ్యూహం మారిందని.. పవన్ కళ్యాణ్ ఆలోచన మారిందని.. పర్యావరణానికి సంబంధించి ఓ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి నాగబాబుకు చైర్మన్ చేస్తారని ఈనాడు రాసుకొచ్చింది. నాగబాబు కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం లేదని.. ఆయనకు రాజ్యసభకు పంపిస్తారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అయితే నాగబాబును ఏపీ క్యాబినెట్ లోకి తీసుకోకూడదని టిడిపి భావిస్తోంది. అందుకే ఈ కథనాలు అంటూ అనుమానాలు ఉన్నాయి. అయితే వీరందరి అంచనాలకు బ్రేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ నాగబాబు కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో తప్పకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది. మొత్తానికి అయితే నాగబాబు మంత్రి కాకుండా టిడిపి అడ్డుకోవాలని చూసింది. కానీ అది జరగని పనిగా తేలిపోయింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!