Sunday, March 16, 2025

జగన్ పై నోరు పారేసుకున్న పృథ్వీ.. అటువంటివి అవసరమా 30 ఇయర్స్ ఇండస్ట్రీ!

- Advertisement -

వివాదాలకు కేరాఫ్ నటుడు పృథ్వి. ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. ఇటీవల విశ్వక్సేన్ లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశాడు. ఏరి కోరి వివాదాలను తెచ్చుకున్నాడు. చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ సినిమా కోసం చివరిగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే పృద్వి తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రోల్ చేస్తూ ఓ సాంగ్ పాడాడు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో సాంగ్ లిరిక్స్ ను తన సొంత లిరిక్స్ తో పాట పాడాడు. జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ చేతిలోనే పథకాలు పెట్టాను.. ఈ చేతితోనే బటన్లు నొక్కాను.. ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను.. ఎన్ని చేసినా నాకు 11 ఇస్తారా.. ఓరయ్యో నా అయ్యా.. అంటూ పాత పాడారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహజంగానే ఇది వైసిపి ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

అయితే పృథ్వి వాడుతున్న భాష మాత్రం బాగాలేదు. అలా భాష బాగాలేదని కదా పోసాని కృష్ణ మురళిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇప్పుడు అటువంటి భాషనే పృథ్వి వాడుతున్నారు. అది కూడా ఒకప్పుడు తాను అభిమానించే జగన్మోహన్ రెడ్డి పై. స్థాయికి మించి, స్థాయికి సరిపడని మాటలు అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో పోసాని కృష్ణ మురళిని చూసి పృథ్వి నేర్చుకోవాలి. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. అది పృథ్వి కి కూడా వర్తిస్తుంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పృథ్వి ఉండేవారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించేవారు. జగన్మోహన్ రెడ్డి సైతం కీలకమైన పదవి ఇచ్చారు పృథ్వి కి. కానీ వివాదాలు తీర్చుకొని ఆ పదవికి దూరమయ్యారు పృథ్వి. పోనీ పార్టీలో ఉన్నారో అనుకుంటే తనంతట తానుగా బయటకు వెళ్లిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి పై ఇప్పుడు ఏకంగా సర్టైరికల్ మాటలు ఆడుతుండడం.. వైయస్సార్ కాంగ్రెస్ పై నోరు పారేసుకోవడం పృథ్వికి అలవాటుగా మారింది.

ఇటీవల లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 11 సీట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పృథ్వి. దీంతో వైసీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో బాయికట్ లైలా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దీంతో హీరో విశ్వక్సేన్. నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది తమకు తెలియకుండా జరిగిందని వారు చెప్పుకున్నారు. పృథ్వి తీరుతోనే ఆ సినిమాకు లాస్ జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలకు దిగుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!