Wednesday, March 19, 2025

బిజెపి జాతీయ అధ్యక్షురాలిగా పురందేశ్వరి.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

- Advertisement -

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు తన శత్రువులను తగ్గించుకుంటున్నారు. ఒకప్పటి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు దగ్గరయ్యారు. మొన్న ఆ మధ్యన దగ్గుబాటి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పొగడ్తలతో ముంచెత్తారు. దశాబ్దాలుగా ఆ కుటుంబంతో ఉన్న వైరాన్ని రూపుమాపేశారు.

నందమూరి తారకరామారావుకు కుమార్తెలు ఉన్నారు. కానీ అల్లుళ్ళుగా సుపరిచితులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 1985లో కాంగ్రెస్ పార్టీలో ఓటమి ఎదురు కావడంతో టీడీపీలో చేరారు చంద్రబాబు. అయితే చేరిక ఆలస్యం అయినా తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించారు చంద్రబాబు. నందమూరి కుటుంబంతో పాటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు సాయంతో టిడిపిని హైజాక్ చేశారు. నందమూరి హరికృష్ణతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మంత్రి పదవిని ఇచ్చి.. తాను మాత్రం ముఖ్య మంత్రి పదవిని అధిరోహించారు.

అయితే పార్టీలో పవర్ సెంటర్లు ఉండకూడదు అని భావించి పొమ్మన లేక పొగ పెట్టారు. తొలుత దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి బయటపడేలా చేశారు. హరికృష్ణను పొమ్మను లేక పొగ పెట్టి బయటకు పంపించేశారు. అటు తరువాత పార్టీని హస్తగతం చేసుకొని తానొక్కడే పవర్ చలాయించారు.

చంద్రబాబు పై ఉన్న రాజకీయ ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు. అలా ఆ పార్టీలో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు పురందేశ్వరి. అటు తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరి ఏపీ రాష్ట్రానికి అధ్యక్షురాలు అయ్యారు. అయితే కాలక్రమంలో అదే చంద్రబాబుకు దగ్గరయ్యారు దగ్గుబాటి దంపతులు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబుకు అనుకూలంగా మారాల్సిన అనివార్య పరిస్థితి వారిది.

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బిజెపిని దగ్గర చేయడంలో పురందేశ్వరి కీలకపాత్ర పోషించారు. అందుకు ఆమె రాజమండ్రి ఎంపీగా పదవి అందుకున్నారు. అయితే చంద్రబాబుతో కలయిక వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తాజాగా తెలుస్తోంది. ఏపీకి సీఎం చంద్రబాబు ఉంటే.. జాతీయస్థాయిలో టిడిపి భాగస్వామ్యం కేంద్రంలో పెరిగింది. ఇక్కడే తన చతురతను ప్రదర్శించారు చంద్రబాబు. పురందేశ్వరిని జాతీయ బిజెపి అధ్యక్షురాలుగా చేయాలన్నది చంద్రబాబు ప్రతిపాదనగా తెలుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలనుకుంటున్న బిజెపి.. చంద్రబాబు చేసిన ప్రతిపాదనపై ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని ప్రయత్నాలు వర్కౌట్ అయితే బిజెపి జాతీయ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!