Wednesday, March 19, 2025

నెల్లిమర్లలో టిడిపి వర్సెస్ జనసేన.. తెలుగుదేశం ను నిర్వీర్యం చేసే పనిలో ఎమ్మెల్యే!

- Advertisement -

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలీయమైన శక్తిగా ఉంది. టిడిపి ఆవిర్భావం నుంచి మంచి ఫలితాలు సాధిస్తూ వస్తోంది. 2024 ఎన్నికల్లో సైతం టిడిపిది విజయం అన్నట్టు విశ్లేషణలు ఉండేవి. అటువంటి నియోజకవర్గాన్ని ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా దక్కించుకుంది జనసేన. అయితే టిడిపికి హార్డ్ కోర్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా మనస్థాపానికి గురయ్యాయి. అధినేత ఆదేశాలతో జనసేన అభ్యర్థి కోసం పని చేశాయి. ఆమె గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. కానీ గెలిచాక ఆ ఎమ్మెల్యే టిడిపిని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. దీంతో టీడీపీ శ్రేణుల బాధ అంతా ఇంతా కాదు.. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? తెలియాలంటే వాచ్ థిస్ స్టోరీ.

విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సతివాడ నియోజకవర్గం కనుమరుగయింది. నెల్లిమర్ల నియోజకవర్గం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచారు జనసేన నేత లోకం మాధవి. తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం కాగా.. పవన్ కళ్యాణ్ కోరేసరికి కాదనలేకపోయారు చంద్రబాబు. అందుకే ఆ పార్టీకి పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కేటాయించారు. సహజంగానే ఇది టిడిపి శ్రేణులకు షాక్ ఇచ్చింది. పార్టీ హై కమాండ్ నిర్ణయం పై చాలా మంది బాధపడ్డారు.

పతివాడ నారాయణస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉండేవారు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. వయోభారంతో బాధపడుతుండగా చంద్రబాబు ఆయనను తప్పించి కర్రోతు బంగారు రాజుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం ఆయన గట్టిగానే కష్టపడ్డారు. తప్పకుండా గెలుస్తారు అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో టిక్కెట్ తన్నుకు పోయారు లోకం మాధవి. చంద్రబాబు ఆదేశాలతో బంగార్రాజు లోకం మాధవి గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారు. అయితే గెలిచిన తరువాత ఆమె నువ్వెవరు అంటూ బంగార్రాజును ప్రశ్నించేసరికి ఆయన షాక్ అయ్యారు. నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశానికి ఆయన హాజరైతే గెటవుట్ అన్నట్టు అవమానపరిచారు. దీంతో మాటకు మాట పెరగడంతో హై కమాండ్లు పంచాయతీలు పెట్టాయి. కంట్రోల్ గా ఉండాలని ఆదేశించాయి. దీంతో వివాదం సద్దుమణుగుతుందని అంత ఆశించారు.

అయితే జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి టిడిపిని నిర్వీర్యం చేసే పనిలోపడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఆమె భర్త ప్రసాద్ జోక్యం పెరిగిందని జనసేనతో పాటు టిడిపి శ్రేణులు కూడా ఆరోపిస్తున్నాయి. దీంతో నెల్లిమర్లకూటమిలో నివురు గప్పిన నిప్పులా ఉంది పరిస్థితి. మరోవైపు ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు తాత్కాలికంగా జనసేనలోకి చేరుతున్నారు. ఇలా చేరుతున్న వారికి టాప్ ప్రయారిటీ దక్కుతోంది. టిడిపి నేతలు కంటే జనసేనలో చేరిన వైసీపీ నేతలకి అధిక ప్రాధాన్యమిస్తున్నారు ఎమ్మెల్యే లోకం మాధవి. మొన్నటికి మొన్న ఓ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో జనసేన వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి మారింది. కొట్టుకునేదాకా పరిస్థితి వచ్చింది. మున్ముందు ఈ నియోజకవర్గం కూటమిలో చికాకు పరిణామాలు ఉంటాయని విశ్లేషణలు ఉన్నాయి. కూటమిలో విభేదాలు ముదరకముందే నాయకత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!