Sunday, March 16, 2025

ఉత్తరాంధ్రలో షాక్ ఇచ్చిన ఉపాధ్యాయులు.. కూటమి విలవిల!

- Advertisement -

ఏపీలో కూటమి ప్రభుత్వానికి షాక్ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది. కానీ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం కోట మీ మాట చెల్లుబాటు కాలేదు. ఆ పార్టీ మద్దతు ఎపిటిఎఫ్ అభ్యర్థికి గట్టెక్కించలేదు. కూటమి మద్దతుతో భారీ విజయం దక్కుతుందని అంచనా వేసుకున్న ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఓటమి చవిచూశారు. కూటమిలో సమన్వయ లోపం రఘువర్మ కు శాపంగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

2019 ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలిచారు. ఆ సమయంలో పిఆర్టియు అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులనాయుడుకు మద్దతు తెలిపింది తెలుగుదేశం పార్టీ. కానీ గాదె శ్రీనివాసులు నాయుడు ఓడిపోయారు. పాకలపాటి రఘువర్మ గెలిచారు. ఇప్పుడు అదే రఘువర్మకు టిడిపి కూటమి మద్దతు తెలిపింది. కానీ ఆయన ఓటమి చవిచూశారు. పి ఆర్ టి యు అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు.

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఉత్తరాంధ్రలో ఘనవిజయం సాధించింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను 32 చోట్ల టిడిపి కూటమి గెలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా పాడేరు, అరకు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయింది. అంతులేని విజయంతో ఉన్న ఆ పార్టీ ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు తెలిపే సరికి ఏకపక్ష విజయం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారు.

అయితే కూటమి సపోర్ట్ చేయడంతో తన గెలుపు నల్లేరు మీద నడక అని భావించారు రఘువర్మ. కానీ మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం లోపించింది. పేరుకే మద్దతు కానీ కూటమి నేతలు సహకరించలేదు. పైగా విశాఖకు చెందిన కొంతమంది బిజెపి నేతలు పిఆర్టియు అభ్యర్థి శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. అటు జనసేన నేతలు సైతం పెద్దగా యాక్టివ్ గా పని చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీపీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఓటమి వెనుక కూటమి నేతల మధ్య సమన్వయ లోపమేనని తెలుస్తోంది. మూడు పార్టీల మధ్య సరైన అవగాహన లేదని అర్థమవుతోంది. రెండు పట్టభద్రుల సీట్లలో గెలిచినా.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటమి మాత్రం కూటమికి గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. కూటమి పార్టీల మధ్య విభేదాలను తెలియజెప్పింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!