Friday, February 14, 2025

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ కౌంటర్

- Advertisement -

Tirumala Laddu: తన తిరుమల పర్యటనపై అబద్దాలు చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నిలదీస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ది కోసం పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘నీకు నోటీసు ఇచ్చారా? తిరుమలకు పోవద్దన్నారా? వేంకటేశ్వరస్వామి గుడికి పోనివ్వబోమని ఎవరైనా చెప్పారా..’ అంటూ చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని.. కాదు కూడదు అని వెళ్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలకు నోటీసులు కూడా అందించారు. ఈ క్రమంలో ఆ నోటీసులను మీడియా ముఖంగా ప్రస్తావిస్తూ.. ‘దీని అర్థం ఏంటి బాబూ?.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే’ అని వైఎస్‌ జగన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు చేసిన నిందల్లో ఏ మాత్రం నిజం లేదని వైఎస్ జగన్ మీడియా ముఖంగానే సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఈ మొత్తం తతంగంలో టీటీడీ అధికారులు, చంద్రబాబు గతంలో స్పందించిన వీడియోలను సైతం బయటపెడుతూ జగన్ ప్రశ్నించడంతో ఏం సమాధానం ఇవ్వాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు, టీడీపీ కూటమి ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని, అందుకే ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశామని ఏకంగా టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా తేల్చిచెప్పారు. అయినా ఈ విషయంలో నిజానిజాలను దాస్తూ టీడీపీ కూటమి రాద్ధాంతం చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లే అని అర్థమవుతూనే ఉంది. కాగా, లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్లపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై నిజానిజాలు తేల్చడానికి సుప్రీం పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణియన్‌ స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!